Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు.. వివాదం ఎక్కడంటే?
posted on: Mar 24, 2026 9:24AM
.webp)
తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ , లోక్ సభ స్థానాలు పెరగనున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, అలాగే ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263 స్థానాలకు పెరిగే అవకాశాలున్నాయి. అంటే తెలంగాణలో 60, ఏఫీలో 88 అసెంబ్లీ సీట్లు అదనంగా పెరుగుతాయి. దేశ వ్యాప్తంగా 273 లోక్ సభ స్థానాలు పెరగనున్నాయి. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా.. ప్రస్తుతం నియోజవర్గాలు ఉన్నాయి.
అప్పటితో పోలిస్తే ఇప్పుడు జనాభా భారీగా పెరిగింది. దీంతో పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియో జకవర్గం ఎంత చిన్నగా ఉంటే.. ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను అంత వేగంగా పరిష్కరిం చగలుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ఇక ఈ విషయంలో ఒకింత వివాదం కూడా నెలకొని ఉంది. కొన్ని రాష్ట్రాల్లో జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుల నియోజకవర్గాల పెంపుదలలో ఆయా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక ఎంపీ స్థానాలు ఎక్కడ ఎక్కువ పెరుగాయి? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దక్షిణాది ఎంపీల సంఖ్య ఎంత? వచ్చే రోజుల్లో పెరగనున్న సంఖ్య ఎంత? ఓవరాల్ గా ఉత్తర- దక్షిణ భారతాల్లో ఎక్కువ మంది ఎంపీలు ఎక్కడి నుంచి ఉన్నారు? అని పరిశీలిస్తే.. పాండిచ్చేరితో కలిపి దక్షిణాదిలో ప్రస్తుతానికి 131 పార్లమెంటు స్థానాలున్నాయి.
రాష్ట్రాల వారీగా ప్రస్తుతం దక్షిణాదిలో పెరగనున్న స్థానాలు ఎన్నో చూస్తే.. ఏపీ 25 నుంచి 38కి, తెలంగాణ 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద దక్షిణాది లో 190 నుంచి 200 స్థానాల వ పెరగొచ్చు. దేశంలోనే అత్యధిక ఎంపీలను ఇస్తున్న రాష్ట్రాలు ఉత్తర్ ప్రదేశ్, బిహార్. ఇదిలా ఉంటే రేపటి రోజున 800కి పైగా పెరగనున్న దేశ వ్యాప్త ఎంపీల సంఖ్యలో మన దక్షిణాది వారు కనీసం 200 మంది కూడా లేక పోవడమూ ఒక రకమైన చర్చనీయాంశమే. ఇక్కడి నుంచి ఎక్కువ జీఎస్టీ వసూళ్లు చేసి.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ మొత్తం ఖర్చు చేయడం అన్నది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్యే. దీన్ని సమతుల్యం చేయడం ఎలా అన్నది వివాదాస్పదంగా మారింది. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందన్న ఆందోళన ఆయా రాష్ట్రాల నుంచి గట్టిగా వ్యక్తం అవుతోంది.
ఇక ఒక్కసారిగా సీట్లు పెరిగితే పార్లమెంటు, అసెంబ్లీ భవనాల్లో.. సీట్లు ఇతర సదుపాయాలను కూడా పెంచాల్సి ఉంటుంది. ఇది వేరే సమస్య. అంతే కాదు ఆయా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికారుల నియామకం కూడా ఒక సవాలే.
అదలా ఉంటే.. 2026 జనాభా లెక్కల తర్వాత.. మన ఎమ్మెల్యేల సంఖ్యతో పాటు ఎంపీల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి కొత్త నాయకులు వచ్చే అవకాశం ఉంది. ఇలా పెరగనున్న స్థానాల విషయంలో రిజర్వేషన్లు ఎలా కేటాయిస్తారన్న చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది.






