Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మావోయిస్టు ఉద్యమంపై ఆశన్న సంచలన వ్యాఖ్యలు
posted on: Mar 11, 2026 6:24PM

మావోయిస్టు లోంగుబాట్లపై ఆశన్న కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యల పరిష్కారానికి చట్టపరమైన మార్గాల్లో తమ వంతు కృషి చేస్తామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ ఆశన్న తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లిలో మాజీ మావోయిస్టులు, అమరుల కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆశన్న మాట్లాడుతూ తాము ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తమ వెంట ఉన్నవారితో పాటు ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టుల ప్రాణాలను కూడా కాపాడేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. మావోయిస్టు పార్టీ బలంగా ఉన్నప్పుడే, అంటే దాదాపు పదేళ్ల క్రితమే లొంగుబాటు నిర్ణయం తీసుకుని ఉంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడుకునేవారని అభిప్రాయపడ్డారు.
దండకారణ్యంలో సుమారు 30 ఏళ్ల పాటు ఆదివాసీల హక్కుల కోసం, నిర్బంధ పరిస్థితుల్లో ప్రశ్నించే హక్కు నిలబెట్టేందుకు పనిచేశామని ఆశన్న గుర్తు చేసుకున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరాలకు వారధిగా ఉన్న భట్టుపల్లితో తన ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందని, ఈ ప్రాంతంతో తనకు విడదీయని అనుబంధం ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో ఆశన్నతో పాటు పవనానందరెడ్డి అలియాస్ శ్యాందాదా, కందగట్ల యాదగిరి అలియాస్ రాజ్మన్, ఆయన భార్య పద్మ, వనిత, వెంకటేశ్, చంప, సంతోష్, అర్జున్, వికాస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మావోయిస్టు నేతలు అమరుల కుటుంబాలను కలవడం, వారితో చర్చలు జరపడాన్ని పోలీసు నిఘా వర్గాలు నిశితంగా గమనించినట్లు సమాచారం.



.webp)


