Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇన్‌కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలంటే..?
posted on: Feb 1, 2018 1:56PM
.jpg)
సాధారణంగా బడ్జెట్ అనగానే అందరూ ఎదురుచూసేది ఇన్‌కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచారా..? తగ్గించారా..? ఏ వస్తువుల రేట్లు పెరుగుతాయి.. వేటికి తగ్గుతాయి అన్న దాని గురించే. మరి 2018-19 వార్షిక బడ్జెట్‌లో అరుణ్‌జైట్లీ వేటి మీద పన్నులు వేశారు..? వేటి మీద తగ్గించారో చూస్తే:
* వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పు లేదు.
* వేతన ఉద్యోగులకు రూ.40వేల వరకు ప్రయాణ, వైద్య ఖర్చులకు స్టాండర్డ్ డిడక్షన్ వర్తింపు.
* సీనియర్ సిటిజన్లకు వైద్య ఖర్చులకు అదనపు రాయితీ. దీనివల్ల 2.5కోట్లమందికి లబ్ధి.
* చిన్న తరహా పాదరక్షలు, తోలు ఉత్పతుల తయారీ సంస్థల లాభాలపై ఆదాయ పన్ను రాయితీ.
* సహకార సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పాదక సంస్థలకు నూరుశాతం పన్ను రాయితీ.
* సీనియర్ సిటిజన్ల బ్యాంకు డిపాజిట్ల ఆదాయంపై పన్ను పరిమితి పెంపు.. రూ.50వేల వరకూ పన్ను వర్తించదు.
* సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులకు అదనపు రాయితీ రూ.60వేల నుంచి రూ.లక్షలకు పెంపు.
* వయో వృద్ధుల ఎఫ్‌డీ, పోస్టాఫీస్ డిపాజిట్లపై టీడీఎస్ ఉండదు. 50 వేల వరకు పన్ను వర్తించదు.
* కార్పొరేట్ ట్యాక్స్ 25శాతానికి పెంపు
* ఆదాయ పన్ను పరిధిలోకి కొత్తగా ఐదు లక్షల మంది
* కొత్తగా 81లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలు
* వైద్య, విద్య సెస్సు 4శాతానికి పెంపు
* మొబైల్ ఫోన్ల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ 15నుంచి 20శాతానికి పెంపు.
* ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించే రంగాల్లో సర్కార్ చెల్లించే ఈపీఎఫ్ 8.33 శాతం నుంచి 12శాతానికి పెంపు. పెంచిన ఈపీఎఫ్ మూడేళ్ల పాటు అమలు.






