Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు గారికి కోపం ఎందుకు వస్తుంది...!
posted on: Feb 3, 2018 11:19AM
.jpg)
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే కదా. రాజకీయ నేతలతో పాటు.. సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిత్రపక్షమైన టీడీపీ కూడా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై మాత్రం అరుణ్ జైట్లీ పాతపాటే పాడారు. ఇక ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో విభజన హామీలను అమలు చేయలేదని, నిధులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారన్న వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ స్పందించారు. ఆంధ్రాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం..ఆయన మాపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేమిటో..అంటూ..'అరుణ్‌జైట్లీ' ఓ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
ఆంధ్రాకు ఇచ్చిన ప్రతిహామీకీ కట్టుబడి ఉన్నాం..విద్యాసంస్థలను పెద్ద ఎత్తున్న కేటాయించాం..వాటికి నిధులు ఇచ్చాం..ఇంకా ఇంత కన్నా ఏమి కావాలి..ఇన్ని ఇచ్చిన మాపై 'బాబు'కు కోపమెందుకు ఉంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటికే కేంద్రంపై రగిలిపోతున్న జనాలు ఇప్పుడు అరుణ్ జైట్లీ వ్యాఖ్యలకు మరింత మండిపడుతున్నారు. అంతేకాదు.. ఇచ్చిన హామీల్లో ఏమి నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అరుణ్ జైట్లీ గారు వ్యాఖ్యలు మరీ కామెడీ కాకపోతే.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్పడంలో ఎలాంటి అర్దం లేదు. జనాలు మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ఏంటీ అని అంటున్నారు.


.jpg)



