Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫైబర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారా? ఈ నిజాలు తెలిసా..!
posted on: Feb 5, 2026 4:01PM

ఆహారం ప్రతి జీవికి శక్తివనరు. ప్రాణం లేని వాహనాలు కూడా వాటికి ఇంధనం ఉంటేనే పని చేస్తాయి. అలాంటి ప్రాణం ఉన్న జీవులకు ఆహారం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్న జీవులలో ఈ ప్రపంచంలో మనిషి చాలా ప్రత్యేకం. అయితే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. ఇందులో ఫైబర్ కూడా ముఖ్యమైనది. చాలామంది ఆహారంలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్ వంటివి ఉన్నాయా లేదా అని చూస్తారు. కానీ ఫైబర్ గురించి ఆలోచించే వారు తక్కువ. ఆహారంలో ఫైబర్ లోపిస్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పైబర్ గురించి నిర్లక్ష్యంగా ఉండేవారు తప్పకుండా తెలుసుకోవలసిన నిజాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
పేగు ఆరోగ్యం..
ఫైబర్ లేకపోవడం వల్ల మన గట్ లైనింగ్ నేరుగా దెబ్బతింటుంది, ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల పేగులు దెబ్బతినే అవకాశాలు క్రమంగా పెరుగుతాయి.
షుగర్ లెవల్స్..
ఫైబర్ లేకపోవడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుదల మరింత తీవ్రమవుతుందని. ఆహారంలో ఫైబర్ ఉన్నప్పుడు, అది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.
కొలెస్ట్రాల్.. గుండె ఆరోగ్యం..
ఫైబర్ శరీరంలో చీపురులా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తుడిచిపెడుతుంది. ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే, ఈ చెడు కొవ్వు ధమనులలో పేరుకుపోతుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
ఫ్యాటీ లివర్..
ఫైబర్ లేకపోవడం కొవ్వు కాలేయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల శరీరం ప్రధాన వడపోత అవయవమైన లివర్ పనితీరు మందగిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
క్యాన్సర్..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫైబర్ లేకపోవడం వల్ల శరీరం బ్యూటిరేట్ అనే ముఖ్యమైన షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. బ్యూటిరేట్ పేగు కణాలకు శక్తిని అందిస్తుంది, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి వాటిని రక్షిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం లేకపోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్, ఇతర శోథ వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని, ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎక్కువ ముప్పును కలిగిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
హార్మోన్ల అసమతుల్యత.. అకాల వృద్దాప్యం..
ఫైబర్ లేకపోవడం వల్ల అంతర్గత అవయవాలు మాత్రమే కాకుండా చిన్న వయసులోనే వయస్సు పెరిగినట్టు (అకాల వృద్ధాప్యం) కూడా ప్రభావితమవుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది, అకాల వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
ఫైబర్ తగినంతగా తీసుకోకపోవడం ముడతలు, శరీరంలో ఎనర్జీ నష్టానికి దారితీస్తుంది. అందువల్ల, ఆహారంలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కాలానుగుణ కూరగాయలను చేర్చడం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...






