Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పరామర్శలా.. ప్రజల ప్రాణాలతో చెలగాటాలా?
posted on: Feb 7, 2026 10:49AM
.webp)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రల పేర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. గొల్లపూడిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన జాతీయ రహదారిపై వైసీపీ పరామర్శల కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయి సామాన్య జనం నరకయాతన అనుభవించారన్నారు. పరామర్శయాత్ర పేర ఆయన చేసిన ర్యాలీ గొల్లపూడి నుంచి ఇబ్రహీపట్నం చేరే లోపే రాంబాబు, భార్గవ్ అనే ఇద్దరు వైపీపీ కార్యర్తలు ప్రాణాలు కోల్పోయారన్నారు.
తన నిర్వాకం వల్ల సొంత పార్టీ కార్యకర్తలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా, జగన్ కనీసం వారికి సంతాపం కూడా ప్రకటించకపోవడం ఆయన బాధ్యతారాహిత్యానికీ, అహంకారానికీ నిదర్శనమని దేవినేని ఉమ విమర్శించారు. అసలింతకీ ఆయన పరామర్శలకు వస్తున్నారా? ప్రాణాలు బలితీసుకోవడానికి వస్తున్నారా అని నిలదీశారు. గతంలో పల్నాడు పర్యటనలో జగన్ కారు కిందపడి సింగయ్య అనే కార్యకర్త మృతిచెందిన ఘటనను దేవినేని ఉమ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కళ్ల ముందే ఇలాంటి సంఘటనలు జరిగినా జగన్ ఇసుమంతైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కానీ, సంతాపం ప్రకటించడం కానీ చేయకపోవడాన్ని దుర్మార్గానికి పరాకాష్టగా ఉమ అభివర్ణించారు.


.webp)



