Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీలో పెచ్చరిల్లిన డ్రగ్స్ సంస్కృతి.. జగన్ పాలనే కారణమన్న షర్మిల
posted on: Mar 9, 2026 12:06PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెచ్చరిల్లడానికి కారణంగా రాష్ట్రంలో జగన్ ఐదేళ్ల పాలనే కారణమని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర లో ఆమె జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం మోడీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు గత ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీని దారుణంగా ఓడంచడంతో ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కోసం బతిమలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.



.webp)


