Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీడీపీ ని వదలొద్దు... బీజేపీ నేతల్లో అసంతృప్తి...
posted on: Jan 29, 2018 3:07PM

ఏపీ రాజకీయాలు ఇప్పుడు మరింత వేడిగా తయారయ్యాయి. ఎప్పుడూ లేనిది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం...వాళ్లు వద్దనుకుంటే మా దారి మేం చూసుకుంటాం అని చెప్పడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు పెద్ద ఎత్తున చర్చలకు దారితీశాయి. ఇక బీజేపీ, టీడీపీ స్నేహానికి బీటలు వారినట్టే అని కొందరు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఎప్పటినుండో వార్తలు వస్తున్న బీజేపీ-వైసీపీ పొత్తు కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు బీజేపీ నేత సోము వీర్రాజు.. మళ్లీ రెచ్చిపోవడం...చంద్రబాబుపైనే విమర్సలు చేయడం..దీనికి తోడు సోము వీర్రాజు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి కలిసి ఒకే పూజలో పాల్గొనడం.. ఇవన్నీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.. అందుకే టీడీపీని లెక్కచేయడం లేదు అన్న వాదనలు కూడా విసిపిస్తున్నాయి. దీంతో రాజకీయ విశ్లేషకులు సైతం వచ్చే ఎన్నికల్లో ఏపీలో కొత్త పొత్తులకు అవకాశం కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. టీడీపీతో విడిపోవడం కొంతమంది బీజేపీ పెద్దలకే నచ్చడంలేదట. టీడీపీని వదలుకోవాలని చూస్తున్న బీజేపీ నేతల ఆలోచనను తప్పుబడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పొచ్చు. గతంలో పొత్తు పెట్టుకున్న పార్టీలు దాదాపు బీజేపీ వైఖరి నచ్చక విడిపోతున్నాయి. ఆఖరికి రెండున్నర దశాబ్దాలకు పైగా బీజేపీకి మిత్రపక్షంగా ఉంటున్న మహారాష్ట్రలోని శివసేన పార్టీ కూడా మోదీ వైఖరి నచ్చక సొంతంగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. బీజేపీతో విడిపోతున్నట్టు ప్రకటన కూడా చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీతో ఏ రాష్ట్రంలోనూ పొత్తులు పెట్టుకోవడానికి పార్టీలు ముందుకు రాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీని కూడా వదులుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలపై కొందరు బీజేపీ ముఖ్యనేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అంతేకాదు ఆ పార్టీ అగ్రనేత అద్వానీ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని… కాకపోతే తన మాటకు విలువలేని చోట ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. టీడీపీతో తెగదెంపులు చేసుకుంటుందో... లేక మూసుకుపోయిన కళ్లు తెరుచుకుంటుందో...






