Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ మెట్రో రైలు ప్రాజెక్టు బాధ్యతలు శ్రీధరన్ కే!
posted on: Oct 9, 2014 7:45AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలలో నిర్మించ తలపెట్టిన మూడు మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఫీసిబిలిటీ మరియు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను తయారుచేసే బాధ్యతలను డిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కార్పోరేషన్ చైర్మన్ ఈ శ్రీధరన్ కు అప్పగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఆయనను ఈ మూడు ప్రాజెక్టులకు ప్రధాన సలహాదారుగా నియమించుకొంది. ఇప్పుడు వాటి నివేదికలు సిద్దం చేసే బాధ్యత కూడా ఆయనకే అప్పగించింది.
క్రిందటి నెల విజయవాడలో పర్యటించిన ఆయన ఈ మెట్రో రైలు ప్రాజెక్టు నడపడం లాభదాయకం కాదు కనుక దానిని ప్రభుత్వం సూచించిన విధంగా విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి ప్రాంతాలను కలుపుతూ నిర్మించడం మంచిది కాదని, దానిని కేవలం విజయవాడ నగరానికే పరిమితం చేయమని సలహా ఇచ్చారు. వచ్చే జనవరి నెలాఖరులోగా ఇందుకోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తానని, కేంద్రప్రభుత్వం నుండి ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు రాగానే ఆరు నెలలలో మొదలుపెట్టి మూడేళ్ళలో పూర్తిచేస్తానని ఆరోజే తెలియజేసారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఈ రెండు నివేదికలు తయారు చేసే బాధ్యతలు అప్పగించడంతో ఇకపై పనులు జోరందుకోవచ్చును. ఆయన ఈనెల 15,16 తేదీలలో వైజాగులో పర్యటించి జీ.వీ.యం.సి. ప్రతిపాదిస్తున్న నాలుగు మార్గాలను అధ్యయనం చేసి నగరానికి బాగా ఉపయోగపడే ఒక మార్గాన్ని సూచిస్తారు. జీ.వీ.యం.సి. ఇప్పటికే ఈ నివేదికలు తయారు చేసేందుకు టెండర్లు పిలవగా నాలుగు కంపెనీలు టెండర్లు దాఖలు చేయ్సాయి. కానీ ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ఆ బాధ్యతలను పూర్తిగా ఆయనకే అప్పగించడంతో ఇక ఆ కంపెనీలకు అవకాశంలేనట్లే భావించవచ్చును.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వైజాగ్ లోనే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ తరుణంలో మెట్రో రైలు కూడా వస్తే ఇక వైజాగ్ నగరం ఇక హైదరాబాదుతో పోటీ పడి మరీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది.


.jpg)
.png)


