Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
posted on: Mar 21, 2026 2:36PM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి పదవీ విరమణ (రిటైర్మెంట్) వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేష్ , మున్సిపల్ శాఖ మంత్రి పీ. నారాయణ పాల్గొన్నారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,500 మంది ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించకపోయినా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించడం గమనార్హం. ఇక ఈ నిర్ణయంపై ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు A. విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉండగా, త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.






