Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్వాలిఫికేషన్ పై చంద్రబాబు జగన్ జోకులు...
posted on: Mar 31, 2017 4:13PM

నారా చంద్రబాబునాయుడు.... వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... ఒకరు ఏపీ ముఖ్యమంత్రి... మరొకరు ప్రతిపక్ష నేత... ఇద్దరూ కీలక నేతలే.... అయితే వీళ్లిద్దరూ అసలేం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? ఇలాంటి డౌట్ ఏమైనా మీకు వచ్చిందా? మీకే కాదు... చంద్రబాబు, జగన్‌కు కూడా ఒకరి క్వాలిఫికేషన్స్‌పై మరొకరికి అనుమానాలు వచ్చాయి... అందుకే అసెంబ్లీ సాక్షిగా ఒకరిపై మరొకరు విమర్శలు, సెటైర్లు, జోకులు పేల్చుకున్నారు. నువ్వేం చదువుకున్నావ్.... అసలు నువ్వెక్కడ చదువుకున్నావ్ అంటూ ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకున్నారు.
చంద్రబాబు మాట్లాడే బట్లర్ ఇంగ్లీష్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసిన జగన్.... ఎంఫిల్ చేయకుండా చేశానని బాబు అబద్దాలు చెప్పారని ఆరోపించారు. చంద్రబాబు ఇంగ్లీష్‌ను చూసి, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా హేళన చేశారని జగన్ సెటైర్లేశారు. టెన్త్, ఇంటర్, డిగ్రీలో తాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌ని అన్న జగన్... తనకు చంద్రబాబులాగా ఇంగ్లీష్‌ని ఖూనీ చేయడం మాత్రం రాదన్నారు.
తన క్వాలిఫికేషన్స్, ఇంగ్లీష్‌పై సెటైర్లేసిన జగన్‌పై చంద్రబాబు కూడా జోకులు పేల్చారు. జగన్ అసలు పరీక్షలే రాసినట్లు లేరన్న బాబు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌నని చెప్పుకుంటున్న జగన్..... అసలు ఎక్కడ చదివారో ఎందుకు చెప్పడం లేదన్నారు. జగన్ ఎక్కడ... ఏం చదువుకున్నాడో కనీసం వాళ్ల ఎమ్మెల్యేలకైనా తెలుసో లేదోనంటూ పంచ్‌లేశారు. తాను ఎస్వీ యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్, ఎంఫిల్ చేశానన్న చంద్రబాబు.... అందుకు మీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే సాక్ష్యమన్నారు. తన క్వాలిఫికేషన్స్‌పై మీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని అడిగినా చెబుతారంటూ జగన్‌కు కౌంటర్ ఇచ్చారు.
అయితే క్వాలిఫికేషన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లు... దుమ్మెత్తిపోసుకోవడంతో అటు టీడీపీ...ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు నోరెళ్లబెట్టారు. ఇదేం గోలరా బాబూ అంటూ తమలో తామే నవ్వుకుంటున్నారు.






