Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పేదల సొంతింటి కల సాకారం దిశగా మరో ముందడుగు.. ఒకే రోజు రెండున్నర లక్షల మందికి గృహాలు
posted on: Mar 30, 2026 4:59PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారమయ్యే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మందితో సోమవారం (మార్చి 30)సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. కచ్చితంగా చెప్పాలంటే.. రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులు ఈ రోజు నూతన గృహాలలోకి అడుగు పెట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తరువాత ఇంతటి భారీ స్థాయిలో ప్రభుత్వం పేదలకు గృహాలు అందించడం ఇది రెండో సారి.
సోమవారం (మార్చి 30) జరిగిన గృహాల పంపిణీలో భాగంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 1,00,875 టిడ్కో, 1,50,018 సాధారణ గృహాలను లబ్ధిదారులకు అందజేసింది. గత ఏడాది నవంబర్ లో 3 లక్షల మందికి ఇళ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రెండో విడతలో 2,50,893 మందికి గృహాలను అందించింది. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు.
ఈ సందర్భంగా నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు గత జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.గత ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన రూ.174 కోట్ల సొమ్మును దారి మళ్లించిందని, ఆ మొత్తాన్ని తిరిగి 82 వేల కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు మెరుగైన వసతులు కల్పించడంలో భాగంగా ప్రతి ఇంటికీ సి.ఎన్.జి గ్యాస్ కనెక్షన్ తో పాటు కుళాయి ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు.


.webp)
.webp)


