Top Stories

 మావోయిస్టులకు కోలుకోని దెబ్బ...బీజాపూర్ లో లొంగిపోయిన 50 మంది మావోలు

చత్తీస్ గడ్ లో మావోయిస్టులకు కోలుకోని దెబ్బ తగిలింది. ఏకంగా 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు.  ఈ విషయాన్ని  బీజాపూర్ ఎస్ పి  జితేంద్రకుమార్ యాదవ్ మీడియాకు చెప్పారు. సిఆర్ పిఎప్ అధికారుల ఎదుట లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా బీజాపూర్ లో వరుసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చత్తీస్ గడ్ పోలీసులు ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చేపట్టారు. లొంగిపోయిన మావోయిస్టులకు పరిహారం ఇస్తామని ఆశచూపారు. ఆదివారం రోజే చెక్కులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామి ఇచ్చింది. మావోయిస్టులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని  ఇప్పటికే ప్రభుత్వం  ప్రకటించింది.లింగిపోయిన వారిలో 10 మంది మహిళా మావోలున్నారు.  లొంగిపోయిన 14 మంది తలలపై రూ 68 లక్షల రివార్డు ఉంది. తమ ఆయుధాలతో   మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడం మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలినట్లయ్యింది. 
 మావోయిస్టులకు కోలుకోని దెబ్బ...బీజాపూర్ లో లొంగిపోయిన 50 మంది మావోలు Publish Date: Mar 30, 2025 7:23PM

 కడపలో వింత ఆచారం.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీగా ముస్లింల పూజలు 

మనదేశం సెక్యులర్ దేశం. హిందువులు ముస్లింలు కల్సి మెల్సి చేసుకునే పండగలు అనేకం. షియాముస్లింలు చేసుకునే పీర్ల పండుగకు హైద్రాబాద్ పాత బస్తీలో ముస్లింలకంటే హిందువులు ఎక్కువ సంఖ్యలో  పార్టిసిపేట్ అవుతుంటారు. ఈ సంవత్సరం ఉగాది మరుసటి రోజే రంజాన్ రావడం విశేషం . కడప జిల్లాలో ఉగాది రోజు జరిగే క్రతువుకు హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ. కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి  దేవాలయంలో ప్రతీ ఏడాది ముస్లింలు పూజలు చేస్తారు. తెల్లారితే రంజాన్ ఉన్నప్పటికీ పూజలు చేసే ముస్లింల సంఖ్య ఏం తగ్గలేదు. భారీగా ముస్లింలు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది.  పురాణ ఇతిహాసాల ప్రకారం బీబీ నాంచారమ్మను వెంకటేశ్వర స్వామిని పెళ్లి చేసుకున్నాడు. బీబీనాంచారమ్మ తమ ఇంటి ఆడపడుచు. శ్రీ వెంకటేశ్వరస్వామి తమ ఇంటి అల్లుడు. అని ముస్లింల నమ్మిక. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతుంది. 
 కడపలో వింత ఆచారం.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీగా ముస్లింల పూజలు  Publish Date: Mar 30, 2025 4:39PM

శ్రీ సత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మ హత్య 

పండుగ పూట  శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో విషాదం  చోటు చేసుకుంది.   ఆర్థిక బాధలు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. బంగారం దుకాణం యజమాని కృష్ణ చారి భార్య సరళ, కుమారులు సంతోష్, భువనేశ్ లు  ఆదివారం ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు స్థానికులు మొదటి  గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.  పెద్ద కుమారుడు సంతోష్ పదో తరతి పరీక్షలు రాస్తున్నాడు. చిన్న కుమారుడు భువనేశ్ తొమ్మిదో తరగతి చువుతున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
శ్రీ సత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మ హత్య  Publish Date: Mar 30, 2025 3:44PM

ఉగాది రోజు  రూ  38 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు 

ఉగాది పర్వ దినం పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు  తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతుంది. పండుగ పూట చేసిన తొలిసంతకం వల్ల 3,456 మంది కుటుంబాల్లో ఆనందం నింపింది. అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన ఈ కుటుంబాలకు లబ్ది చేకూరే విధంగా రూ 38 కోట్లను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారు. ఆర్థికంగా దెబ్బతిన్న ఈ కుటుంబాలకు లబ్ది చేకూరవిధంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు 23, 418 మంది పేద కుటుంబాలను ఆదుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పేదల వైద్యం కోసం రూ, 281. 38 కోట్లు రిలీజ్ చేసినట్టు పేర్కొంది.   
ఉగాది రోజు  రూ  38 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు  Publish Date: Mar 30, 2025 3:04PM

ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అంధాకారం:  ఉగాది వేడుకల్లో చంద్రబాబు

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దశ దిశ లేకుండా పోయిందని, రాష్ట్రం కళ తప్పిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకని విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో కూటమి ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ వే డుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కూటమి అధికారంలో రాగానే ప్రజా సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించామన్నారు. సంక్షేమవ, అభివృద్దికి పెద్ద పీట వేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం వేసిన చిక్కుముడులను ఒక్కోటి విప్పాల్సివస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ అవసరం ఏర్పడిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను ఐటికి ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ రోజు ఐటి అవసరం లేదని చాలామంది విమర్శించి చివరకు ఐటి మాత్రమే దిక్కయ్యిందని చంద్రబాబు అన్నారు. సెల్ ఫోన్ తిండిపెడుతుందా అని వ్యాఖ్యానించిన నేతల వద్ద ప్రస్తుతం సమాధానం లేకుండా పోయిందన్నారు. వర్క్ ఫ్రం హోం సంస్కృతి పెరగడానికి ఐటీ విప్లవమేనన్నారు. కూటమి ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిట్లో తేవడానికి వాట్స ప్ గవర్నెన్న్ తీసుకొచ్చినట్లు చెప్పారు. వివిధ సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేకుండా సెకన్ల వ్యవధిలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్టిఫికేట్లను సెల్ ఫోన్ ద్వారా తీసుకునే వెసులు బాటు కల్పించినట్లు చంద్రబాబు చెప్పారు.  పేదరిక నిర్మూలనకు మార్గదర్శి బంగారు  కుటుంబం, పీ 4 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  పేదరికం లేని సమాజం చూసినప్పుడే తన జన్మ  చరితార్థమవుతుందని చంద్రబాబు అన్నారు
ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అంధాకారం:  ఉగాది వేడుకల్లో చంద్రబాబు Publish Date: Mar 30, 2025 2:27PM