Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు?
posted on: Jun 3, 2014 8:22AM
.jpg)
ఇంతవరకు నవంబర్ 1న మనం రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకొంటున్నాము. కానీ నిన్న అంటే జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణా విడిపోవడంతో రెండు రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా అవతరించాయి. అంటే జూన్ 2నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కూడా జరిగినట్లు అనుకోవచ్చును. కానీ, మద్రాసు నుండి అవిబాజ్య ఆంధ్రప్రదేశ్ వేర్పడిన నవంబర్ 1నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినంగా పరిగణించాలని కొందరు వాదిస్తున్నారు. ఎందువలన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కొన్ని జిల్లాలను తీసుకొని తెలంగాణా వేర్పడి వెళ్లిపోయినంత మాత్రాన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మార్చుకోవలసిన అవసరం లేదని వారి వాదన. ఇక మరొక వాదన కూడా వినిపిస్తోంది. జూన్ 8న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పడుతుంది గనుక, ఆరోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినంగా ప్రకటించాలని కొందరు కోరుతున్నారు. ఈవిషయమై మీడియాలో కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాతనే ఈవిషయమై ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.


.jpg)
.jpg)


