తాడిపత్రిలో హై టెన్షన్
posted on Nov 12, 2025 12:15PM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందు జాగ్రత్త చర్యగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. అదే సమయంలో, స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు.
దీంతో పెద్దారెడ్డి కార్య క్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దారెడ్డిపై ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరిని అడ్డుకుంటున్నాం.. గత ఐదేళ్లు పట్టిన పీడను వదిలించుకుని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటామంటే ఎలా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో పెద్దారెడ్డి ఏం చేశారని అంటు అస్మిత్‌రెడ్డి ప్రశ్నించారు