అణుమారణహోమానికి అమెరికా కాలుదువ్వుతోందా?

posted on: Mar 21, 2026 2:43PM

ప్రపంచాన్ని అణుయుద్ధ భయం వణికిస్తున్న వేళ.. అణు బాబు పేలితే పరిస్థితి ఏమిటన్న దానిపై తెలుగువన్ ప్రత్యేక కథనం అమెరికా యుద్ధ కాంక్ష మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లేలా చేస్తోంది. అనవసర అహంకారంతో అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నాయా? అణ్వస్త్ర దేశాలనూ యుద్ధంలో భాగస్వాములను చేసేలా ట్రంప్ ప్రకటనలు ప్రపంచ వినాశనానికి దారి తీస్తాయా? అమెరికా, ఇజ్రాయెల్ లు సంయుక్తంగా ఇరాన్ పై ప్రకటించిన యుద్ధం నేపథ్యంలో ఈ ప్రశ్నలు అందరిలో భయాందోళనలకు సృష్టిస్తున్నాయి.

అసలు అణుయుద్ధమే వస్తే పరిస్థితులు ఎలా మారతాయన్నది ఊహకే అందనంత భయంకరంగా, బీభత్సంగా ఉంటుంది. అసలు ఒక అణుబాంబు పేలితే ఏమౌతుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే వణుకు పుట్టడం ఖాయం.  ఒక అణు బాంబు గనుక ఏదైనా నగరం మీద పడితే..సెకన్ల వ్యవధిలో ఆ నగరం భస్మీపటలమైపోతుంది.  బాంబు పడిన వెంటనే  గ్రౌండ్ జీరో నుంచి రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో  ప్రాణి అనేది మిగలకుండా మాడి మసైపోతుంది.  అణు బాంబు విస్ఫోటనం ఆ ప్రాంతంలో  ఉష్ణోగ్రత దాదాపు ఒక కోటి డిగ్రీల సెల్సియస్ కు చేరుతుంది. అంటే సూర్యుడి ఉపరితలంపై ఉండే వేడికికి వేల రెట్లు ఎక్కువ అన్నమాట. అంటే పరిస్థితి ఎంతటి భయంకరంగా ఉంటుందో ఇట్టే అర్ధమౌతుంది.  ఆ వేడికి తోడు వెయ్యి కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలి అణుబాంబు పేలిన ప్రదేశం నుంచి ఎనిమిది  కిలో మీటర్ల పరిధిలో భారీ కాంక్రీట్ భవనాలను సైతం పేకమేడల్లా కూల్చేస్తుంది. 

 ఆ ప్రాంతానికి  కిలోమీటర్ల దూరంలో ఉన్న వారని సైతం తీవ్రంగా గాయపరుస్తుంది.వారి చర్మం కాలిపోయి కమిలిపోతుంది. ఆ గాయాల తీవ్రత శరీరంపై 40 శాతానికి మించి ఉంటే.. మనిషి బతికే అవకాశాలు మృగ్యం. తీసుకుని తీసుకుని చనిపోతాడు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఒక్క అణుబాంబు లక్షల మంది ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేస్తుంది. అక్కడితో అణుబాంబు ప్రభావం ఆగిపోయినట్లు కాదు.. అసలు సిసలు విధ్వంసం అక్కడి నుంచే మొదలౌతుంది.  అణు బాంబు పడితే వచ్చే నల్లటి మేఘాల వల్ల నూక్లియర్ వింటర్ ఏర్పడుతుంది. సూర్యరశ్మి ఆ మేఘం కారణంగా నేలకు రాదు. ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీల వరకూ పడిపోతాయి.సూర్యరశ్మి తగలకపోవడంతో పంటలు పండవు, ఉష్ణోగ్రతలు మైనస్ కు పడిపోవడం వల్ల నీరు ఘనీభవిస్తుంది. దీంతో వందల కోట్ల మంది ఆకలి, దప్పికలతో అలమటించి కన్నుమూస్తారు.  

అంతటితో ఈ విధ్వంసం ఆగదు. బతికి బట్టకట్టిన వారిని రేడియేషన్ ప్రభావం తరతరాలు వెంటాడుతుంది.  పిల్లను జన్యు  లోపాలతో  పుడతారు. క్యాన్సర్ బాధితుల సంఖ్య 400శాతానికి పైగా పెరుగుతుంది.  ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు.. అమెరికా జోక్యం  నేపథ్యంలో  ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అణుయుద్ధంపై చర్చ జరుగుతోంది. అణుయుద్ధ భయంతో ప్రపంచం వణికిపోతంది.   ఇజ్రాయెల్ గనుక అణ్వాయుధాన్ని   ఉపయోగిస్తే అది మానవ మనుగడకే ముప్పుగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జనం యుద్ధం వద్దు శాంతి ముద్దు అన్న నినాదాలు చేస్తున్నారు.  

 

google-ad-img
    Related Sigment News
    • Loading...