Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ట్రంప్‌కు ఝలక్
posted on: Mar 18, 2026 9:19AM

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతున్న సమయంలో యూఎస్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ జోసెఫ్ కెంట్ అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ కు ఝలక్ ఇచ్చారు. యుద్ధ సమయంలో జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికాకు ఇప్పటికిప్పుడు ఇరాన్ వల్ల వచ్చే ముప్పేది లేదని తన రిజిగ్నేషన్ లెటర్ లో పేర్కొన్నా ఆయన ఇజ్రాయెల్ ఒత్తిడి కారణంగానే ట్రంప్ యుద్ధానికి దిగాలని నిర్ణయం తీసుకున్నట్టు కుండబద్దలు కొట్టారు.
బాగా ఆలోచించి తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న కెంట్ తన రాజీనామా తక్షణం అమల్లోకి వచ్చిందనిఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇరాన్‌తో యుద్ధాన్ని తాను మనస్సాక్షిగా, మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వలేననీ ఆయన ఆ పోస్టులో స్ఫష్టంగా చెప్పారు. ఇజ్రాయెల్, దాని శక్తిమంతమైన అమెరికా లాబీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే అమెరికా యుద్ధం ప్రారంభించిందని కెంట్ పేర్కొనడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.






