Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ చేతిలో అంబటి రాంబాబు ఓ పావు.. నిమ్మల
posted on: Feb 3, 2026 3:00PM
.webp)
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో గత జగన్ ప్రభుత్వ తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన లడ్డూ ప్రసాదం వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు అంబటి రాంబాబును జగన్ ఓ పావులా వాడుకున్నారని, వాడుకుంటున్నారని నిమ్మల ఆరోపించారు. కాపు సామాజికవర్గ నాయకులను వైసీపీ కేవలం ఓటు యంత్రాలుగా, అవసరానికి వాడుకునే సాధనాలుగా మాత్రమే చూస్తోందన్నారు. గతంలో కాపు రిజర్వేషన్లను జగన్ రద్దు చేస్తున్న సమయంలో అంబటి నోరెత్తకపోవడాన్ని ఆయన ఆఈ సందర్భంగా గుర్తు చేశారు. అంబటి కుటుంబ సభ్యులు, సానుభూతిపరులు ఇప్పటికైనా జగన్ తీరును నిలదీసి ప్రశ్నించాలని నిమ్మల రామానాయుడు అన్నారు.
ఇక ముదరగడ లేఖపై కూడా నిమ్మల రామానాయుడు స్పందించారు. ముద్రగడ పద్మనాభం తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ముద్రగడ పద్మనాభ రెడ్డికి కాపుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను ఉద్దేశించి అంబటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
సమాజంలో కులాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడమే వైపీపీ వ్యూహమన్న రామానాయుడు, కాపుల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమన్నారు. హిందువుల సెంటిమెంట్లను దెబ్బతీసిన కల్తీ లడ్డూ వ్యవహారంలో బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైసీపీ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కులం కార్డును ప్రయోగిస్తోందన్న విషయాన్ని ప్రజలు గమనించి, గుర్తిస్తున్నారని రామానాయుడు అన్నారు.


.webp)
.webp)


