Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దోపిడీకి పాల్పడిన అమెజాన్ ఉద్యోగి
posted on: Mar 21, 2026 10:01AM
.webp)
హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగి ఓ దోపిడీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. అంతే కాకుండా ఈ దోపిడీకి పాల్పడింది అమెజాన్ ఉద్యోగిగా గుర్తించి నిందితుడిని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెడితే.. ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాక్ హిల్స్ కాలనీలో ఓ ఇంటికి వెళ్లి తనను తాను ఏసీ మెకానిక్‌గా పరిచయం చేసుకున్న నిందితుడు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తలపై ఇనుపరాడ్ తో కొట్టి గాయపరిచి.. ఆమె మెడలోని సుమారు 25 గ్రాముల బంగారు పుస్తెల తాడు దోచుకుని పరారయ్యాడు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. దోపిడీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించి అదుపులోనికి తీసుకుని అతడు దోచుకున్న పుస్తెల తాడును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అమెజాన్ లో పని చేస్తున్న ఉద్యోగి అబ్రార్ అహ్మద్ గా గుర్తించారు.



.webp)


