వీగిపోయిన జగన్ బ్యాచ్ ఫేకు ప్రచారం.. క్యాపిటల్ సిటీ అమరావతి సురక్షితం

ప్ర‌కృతి ప్ర‌కోపానికి విజ‌య‌వాడ‌ వ‌ణికిపోయింది. గ‌తంలో ఎప్పుడూలేని స్థాయిలో కురిసిన కుండ‌పోత వ‌ర్షానికి తోడు బుడ‌మేరు, కృష్ణా న‌దిలోకి రికార్డు స్థాయిలో వ‌ర‌ద రావ‌డంతో న‌గ‌రంలోని జ‌నావాసాల‌ను వ‌ర‌ద‌నీరు చుట్టు ముట్టింది. న‌డుములోతు నీటిలో ప్ర‌జ‌లు చిక్కుకుపోయారు. విజ‌య‌వాడ‌లోని ప‌లు ప్రాంతాల్లోకి వ‌ర‌ద‌నీరు చేర‌డంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. అధికారులు, మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌ర‌ద ముంపు బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. వారికి ఆహారం, తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తూ అండ‌గా నిలిచారు.

74ఏళ్ల వ‌య‌స్సులో ముంపు బాధితుల‌కు అండ‌గా నిలిచేందుకు నిద్రాహారాలు మరిచి రాత్రింబ‌వ‌ళ్లు చంద్ర‌బాబు ప‌డిన క‌ష్టాన్ని చూసి ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇలాంటి నాయ‌కుడు ఉండ‌టం ఏపీకి గ‌ర్వ‌కార‌ణం అంటూ రాష్ట్రం వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌లు జ‌ల్లు కురుస్తోంది. పొరుగు రాష్ట్రంలోని విపక్షం కూడా చంద్రబాబు కార్యదక్షత, సమర్థత, వరద బాధితులను ఆదుకోవడంలో ఆయన పడిన శ్రమను వేనేళ్ల ప్రశంసించింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు చంద్రబాబును పొగుడుతూ చేసిన ట్వీట్ చేశారు. చంద్రబాబుకు ప్రజలలో ఆదరాభిమానాలు పెరగడం, తమ మిత్రుడైన కేసీఆర్ కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించడం   ఓర్వ‌లేని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌లు చంద్ర‌బాబుదంతా ప‌బ్లిసిటీ స్టంట్ అంటూ విష ప్రచారానికి తెరలేపారు.  అలాగే  మొద‌టినుంచి అమ‌రావ‌తిపై క‌క్ష‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్‌.. వ‌ర‌ద‌ల కార‌ణంగా అమ‌రావ‌తి మునిగిపోయిందంటూ తన అనుకూల సోషల్ మీడియా ద్వారా  ఫేక్ ప్ర‌చారం చేశారు. తప్పుడు ఫొటోలు, వీడియోల‌తో సోష‌ల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ అమ‌రావ‌తిపై విషం చిమ్మంది.  ఈ క్ర‌మంలో.. అసలు అమ‌రావ‌తి ప్రాంతాన్ని వ‌ర‌ద నీరు ముంచెత్తిందా..?  హైకోర్టు ప్రాంతం నీటిలో మునిగిపోయిందా... స‌చివాల‌యంలోకి నీరు చేరిందా? అనే విషయాలు తెలుసుకుందాం. 

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని విఛ్చిన్నం చేయాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశ్వప్ర యత్నాలు చేశాడు. వైసీపీ నేతలు అమరావతి ప్రాంతాన్ని స్మశానం అనికూడా అన్నారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో అమరావతి ప్రాంతం అధ్వాన్న స్థితికి చేరింది. ముళ్ల చెట్లు కంపలతో  ఓ అడవిలా మారిపోయింది. కానీ, ఏపీ ప్రజలు మాత్రం మా రాజధాని అమరావతే అంటూ నమ్మారు. అదే విషయాన్ని ఎన్నికలలో తమ ఓటు ద్వారా విస్పష్టంగా తేల్చేశారు.  మూడు రాజధానుల పేరుతో అమరావతిని విఛ్చిన్నం చేయాలని చూసిన జగన్ మోహన్ రెడ్డి పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదాకూడా ఇవ్వలేదు. ఎన్నికల్లో ప్రజల తీర్పు తరువాతకూడా అమరావతిపై జగన్ మోహన్ రెడ్డి అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియా విషం చిమ్ముతూనే ఉన్నాయి.

తాజాగా ఏపీలో భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. గతంలో 120ఏళ్లలో ఎప్పుడూ రానంత స్థాయిలో వర్షం పడటం, వరదలు రావడంతో విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. బుడమేరు, కృష్ణానదిలోకి రికార్డు స్థాయిలో వరదనీరు వచ్చింది. దీంతో బుడమేరు వరద కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు రావడంతో సీఎం చంద్రబాబు వెంటనే అప్రమత్తమై ముంపు బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. అర్థరాత్రి సైతం బోటుపై వెళ్లి వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వరద ముంపు ప్రాంతంలో నామమాత్రపు పర్యటన చేసి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కరకట్ట వద్ద చంద్రబాబు ఇంటిని వరద ముంపు నుంచి తప్పించేందుకు బడమేరు గేట్లు ఎత్తారని.. దానికారణంగా విజయవాడ నగరంలోని వరదనీరు వచ్చిందని జగన్ చెప్పుకొచ్చాడు. అసలు కరకట్ట వద్ద చంద్రబాబు ఇంటికి, బుడమేరుకు ఎలాంటి సంబంధం లేదు. బుడమేరు వాగుకు గేట్లు కూడా లేవు. కనీస అవగాహన, పరిజ్ణానం లేని జగన్ వ్యాఖ్యలతో సోషల్ మీడియా ఆయనను ఓ రేంజ్ లో ఆటాడుకుంటోంది.  

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వరద నీటిలో మునిగిపోయిందని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం ఫేక్ ప్రచారమని స్పష్టంగా అర్థమవుతోంది. అమరావతికి పది కిలో మీటర్ల దూరంలో విజయవాడ మహాన గరం వరద ముంపునకు గురైంది. గుంటూరులోనూ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అమరావతి మునిగిపోయిందంటూ ఫేక్ ప్రచారం మొదలు పెట్టింది. వాస్తవానికి అమరావతిలోకి  వరద నీరు చేరలేదు. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు సహా కోర్ క్యాపిటల్ ప్రాంతం అత్యంత సురక్షితంగా ఉంది. రాజధాని గ్రామాల్లో వర్షం కారణంగా నీరు నిలిచింది. దీంతో కాలనీల్లోని రోడ్లపై నిలిచిన వర్షపు నీటికే రాజధాని పరిధిలోని గ్రామాలు వరదలో మునిగిపోయాయంటూ వైసీపీ బ్యాచ్ ఫేక్ ప్రచారం చేసింది. మరోవైపు.. కరకట్ట వద్ద చంద్రబాబు ఇల్లు కృష్ణా వరదలకు మునిగిందని ప్రజలను నమ్మించేందుకు వైసీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా విశ్వప్రయత్నాలు చేసింది. వైసీపీ అనుకూల మీడియాకు చెందిన కెమెరా మెన్లు, వీడియోగ్రాఫర్లు చంద్రబాబు ఇంటి వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరదనీరు వస్తుంది.. పెద్దపెద్ద ఫొటోలతో విస్తృత ప్రచారం చేయొచ్చని అనుకున్నారు. కానీ, చంద్రబాబు ఇంటిలోకి వరద నీరు చేరకపోయే సరికి.. తప్పుడు ప్రచారానికి తెరలేపారు. 

రాజధాని ప్రాంతానికి, నదికి మధ్యలో పెద్ద కరకట్ట ఉంది. వరదనీరు దాని వరకూ వచ్చి ఆగిపోయింది. ఆ రెండింటి మధ్యలో ఉన్న కొన్ని భవనాలు మాత్రం కొంతమేర ముంపుకు గురయ్యాయి. మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం నది ఒడ్డునే ఉంది. దానిలోకి నీళ్లు వచ్చాయి. ఆ పక్కనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉంటున్న అద్దె ఇల్లు ఉంది. ఆ ఇల్లు కూడా నదికి ఆనుకొనే ఉంటుంది. దీంతో ఆ ఇంటి ప్రాంతంలోకి స్వల్పంగా వరద నీరు చేరింది. దీంతో చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది. అమరావతి రాజధాని ప్రాంతంలోకి వరదనీరు పెద్ద ఎత్తున చేరిందంటూ జగన్ అనుకూల మీడియా ఫేక్ ప్రచారం చేస్తుంది.

సాధారణంగా ఏ నదిలోకైనా ఎగువ ప్రాంతాల నుంచి పెద్దుత్తున వరదనీరు వచ్చి చేరినప్పుడు.. దాని పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం కృష్ణా నదికి గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో వరదనీరు వచ్చి చేరింది. రాబోయే కాలంలో ఇంతస్థాయి వరద రావటంకూడా అసాధ్యమనే చెప్పొచ్చు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో కృష్ణా నదిలో వచ్చిన వరదలకు, కుండపోత వర్షానికి అమరావతి చెక్కు చెదరలేదు. రోడ్లు క్లీన్ గా ఉన్నాయి. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని పక్కనపెడితే.. రికార్డు స్థాయిలో వచ్చిన వరదల్లోకూ అమరావతి సేఫ్ గా ఉదంటే .. ఏపీకి రాజధానిగా అమరావతి ఎంపిక ఎంత ఉత్తమమో తేలిపోయింది.