ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. నిదితులందరినీ ఒకేసారి విచారణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో  కీలక పరిణామాలు చోటుచేసుకు న్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ గురువారం (డిసెంబర్ 25)తో ముగిసింది. ఈ నేపథ్యంలో  సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలోనే ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం  ఈ కేసుకు సంబంధించిన  నిందితులందరినీ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి ఒకేసారి విచారించారు.

ఈ కేసులో నిందితులైన ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌ రావుతో పాటు తిరుపతన్న ను విచారణకు హాజరు కావాలని సిట్‌ అధికారులు ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి ప్రభాకర్‌రావు 14 రోజుల కస్టడీ గురువారం (డిసెంబర్ 24) ముగిసింది. ఈ  నేపథ్యంలో ఆయనను ఇతర నిందితులతో కలిపి   సిట్ విచారించింది.  కస్టడీ సమయంలో అడిగిన మెజార్టీ ప్రశ్నలకు ప్రభాక ర్‌రావు బదులు చెప్పలేదని సమాచారం. అయితే విచారణలో మాజీ ఇంటె లిజెన్స్‌ చీఫ్‌లు నవీన్‌చంద్‌, అనిల్‌ పేర్లను ఆయన  ప్రస్తావించి నట్లు తెలుస్తోంది.

అలాగే సుమారు ఆరు వేల  ఫోన్‌ నంబర్లు ఉన్న పెన్‌డ్రైవ్‌ అంశంపై ప్రభాకర్‌రావు నోరు మెదపలేదని అధికారులు తెలిపారు. మాజీ మంత్రి హరీష్‌ రావు తనతో మావోయిస్టుల అంశంపైనే మాట్లాడినట్లు ప్రభాకర్‌రావు విచారణలో వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే తనకు రీఎంప్లాయిమెంట్‌ ఎలా మంజూరయ్యిందన్న విషయంపై మాత్రం ప్రభాకర్‌రావు మౌనం పాటించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు  కీలక దశకు చేరిందని, 14రోజుల కస్టడీ విచారణలో ప్రభాకర్ రావు ఏం చెప్పారు? ఎటువంటి విషయాలు బయటపడ్డాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగారావులను విచారించిన సిట్ ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలపై సిట్  లోతుగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.  ఇదే కేసులో ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావును కూడా సిట్ అధికారులు విచారించారు. దర్యాప్తు పరిధిని విస్తరిస్తూ, వివిధ కోణాల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.

ఇక విచారణకు హాజరైన డీఎస్పీ ప్రణీత్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. రెండు రోజుల క్రితమే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును కలిసి విచారించిన సిట్, తాజాగా గురువారం (డిసెంబర్ 24) ప్రణీత్ రావును సుమారు ఎనిమిది గంటల పాటు విచారించింది. ఈ విచారణలతో కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu