ఆల్బ‌ర్ట్‌.. పుట్టుక‌తో సంగీత‌విద్వాంసుడు

కాస్త విన‌సొంపుగా పాడుతూంటే ఓ క్ష‌ణం వినాల‌నిపిస్తుంది.. ఎవ‌ర‌న్నా ఫ్లూటో, వీణో వాయిస్తుంటే వీనుల విందుగా వుంటే .. మ‌రో పాట‌నో, కీర్త‌న‌నో వాయించ‌మ‌ని కోరుతూంటారు.  పాడ‌టం, వాద్య నైపుణ్యాలు స‌ర‌స్వ‌తీ క‌టాక్షం అంటారు పెద్ద‌లు. అది అంద‌రికి అబ్బే విద్య‌ కాదు. వంద‌ మంది పాడేవారుండ‌వ‌చ్చు.. ఏ ఇద్ద‌రు ముగ్గురి గొంతో అమృతం పోసిన‌ట్టు వుంటుంది.

అలానే వాద్య నైపుణ్యం కూడా.   కొంద‌రు పిల్ల‌ల‌కు ఊహించ‌ని విధంగా పాటో, ఏదో వాద్య నైపుణ్య‌మో స‌హజంగా వుంటుంది. ఇలాంటివి అక్క‌డో ఇక్క‌డో ఎవ‌రో ఒక‌రు గ‌మ‌నించే వుంటారు. ఒక పిల్ల‌వాడు హ‌ఠాత్తుగా పియానో అద్భుతంగా వాయిం చ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఐదేళ్ల ఆ పిల్ల‌వాడి పేరు ఆల్బ‌ర్టో క‌ర్టూసియా. వాడు వాయించింది ఏదో సినిమా పాటో, ట్యూనో కాదు.. ఏకంగా మొజార్ట్ గీతం!  దాన్ని ఒక  క‌ళాపిపాసి వీడియో తీసేడు.

3.8  మిలి య‌న్ల మంది ఆ వీడియోను వీక్షించి బుడ‌తడిని  ఆశీర్వదించారు.  ఏద‌న్నా వాద్య‌ ప‌రిక‌రం ప‌ట్ల ఆస‌క్తి క‌ల‌గ‌వ‌చ్చు, నేర్చుకోవ‌చ్చు. కానీ  అంద‌రినీ క‌ట్టిప‌డేసేంత  గొప్ప నైపు ణ్యం ప్ర‌ద‌ర్శించ‌డం చాలా చాలా అద్భుతం.

 ఐదేళ్ల ఆల్బ‌ర్టో విష‌యంలో ఆ విశేష‌ణ స‌రైన‌దే. పియానో పై మోజార్ట్ గీతాన్ని వినిపించ‌డం అంత సుల‌భ‌ సాధ్యం కాదు. కానీ అది చేసి చూపాడు ఐదేళ్ల ఆల్బ‌ర్టో. అందుకే వీడిని బార్న్ మ్యూజీషియ‌న్ అంటున్నారు. అచ్చం మ‌న మంగ‌ళంప‌ల్లి బాల‌ముర‌ళీకృష్ణ‌ను యావ‌త్ సంగీత లోకం ప్ర‌శంసించిన‌ట్టు.