Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అత్తమీద కోపం దుత్తమీద చూపించిన అఖిలేష్
posted on: May 20, 2014 4:23PM

ఎవరిమీద కోపాన్నో వేరెవరిమీదో చూపిస్తే అత్తమీద కోపాన్ని దుత్తమీద చూపించారని అంటారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన పని కచ్చితంగా ఇలాంటిదే. ఈ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతోపాటు అధికార సమాజ్‌వాది పార్టీ కూడా గల్లంతు అయిపోయింది. ఉత్తర ప్రదేశ్ మొత్తంలో సోనియా, రాహుల్ తప్ప మిగతా పార్లమెంట్ స్థానాలన్నీ బీజేపీయే గెలుచుకుంది. ఎస్పీ అభ్యర్థులందరూ డిపాజిట్లు గల్లంతైపోయి అడ్రస్ లేకుండా పోయారు. అయితే సమాజ్ వాది పార్టీ అధికారంలో వున్నప్పటికీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోకపోవడానికి మోడీ హవాతోపాటు మరో కారణం కూడా వుంది. సమాజ్ వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ మహిళల గురించి దారుణంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఈ పార్టీ ఓటమికి కారణమయ్యాయి. ఈ విషయాన్ని తెలిసి కూడా తెలియనట్టుగా యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ వ్యవహరిస్తున్నాడు. తమను ఘోరంగా ఓడించిన మోడీమీద వున్న కోపాన్ని తన మంత్రివర్గ సహచరుల మీద చూపించాడు. తనతో కలసి 43 మంది మంత్రివర్గ సభ్యులున్నారు. వీరిలో 36 మందిని పదవుల నుంచి తొలగిస్తూ అఖిలేష్ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఇంతమంది మంత్రులను తీసేయడం కంటే, బీహార్‌లో నితీష్ కుమార్‌లా మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేయొచ్చు కదా అని ప్రశ్నిస్తే, నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అఖిలేష్ కూల్‌గా సమాధానం చెప్పాడు.


.jpg)
.png)


