మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. అభిషేక్ సింగ్ అరెస్టు

posted on: Mar 21, 2026 12:10PM

తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించిన మొయినాబాద్‌ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అభిషేక్ సింగ్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని   ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు. అభిషేక్ సింగ్ ద్వారా  నగరంలో మరెవరెవరికి డ్రగ్స్ సరఫరా జరిగిందన్న విషయాన్ని రాబట్టనున్నారు.

 మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్  హౌస్ లో డ్రగ్స్ పార్టీ కేసులో అభిషేక్ సింగ్ అరెస్టును కీలక పరిణామంగా భావించవచ్చు. ఈ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసింది అభిషేక్ సింగేనని అనుమానిస్తున్న సంగతి విదితమే. తాను అభిషేక్ సింగ్ నుంచే డ్రగ్స్ తీసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కారు డ్రైవర్ విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే. అభిషేక్ సింగ్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. అయితే డ్రగ్స్ సరఫరాదారుగా ఆయనకు నేర చరిత్ర ఉంది.

గతంలో కూడా పైలట్ రోహిత్ రెడ్డికి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  కాగా అభిషేక్ ను అరెస్టు చేసిన సిట్ అధికారులు అతడి మొబైల్ ఫోన్ ను స్వీధీనం చేసుకున్నారు.  అతడి డ్రగ్స్ నెట్వర్క్ లో ఎవరెవరున్నారన్న దానిపై విచారిస్తున్నారు.  ఎవరెవరు ఉన్నారనే దానిపై విచారిస్తున్నారు అభిషేక్ సింగ్ సెల్‌ఫోన్ డేటాను పరిశీలిస్తున్న సిట్.. ఆ డేటా ఆధారంగా  పలువురు ప్రముఖులు, వ్యాపారవే త్తలతో  అతడిరి ఉన్న సంబంధాలు బయటపడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అలాగే అభిషేక్ సింగ్ అరెస్టుతో మొయినాబాద్ ఫామ్‌ హౌస్‌  డ్రగ్స్ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...