ఆరోగ్య శ్రీ సేవలను ఆపేస్తున్నాం..

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ సేవలను తెలంగాణ వ్యాప్తంగా నిలిపివేస్తున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ ప్రకటించాయి. తమకు కట్టవలసిన బకాయిలు ఇప్పటి వరకూ చెల్లించలేదని..250 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని.. అందుకే తమ సేవలను నిలిపివేస్తున్నట్టు.. తెలంగాణ హాస్పిటల్స్‌ అండ్‌ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ టి. నర్సింహారెడ్డి, కన్వీనర్‌ డాక్టర్‌ ఎల్‌.సురే్‌షగౌడ్‌ తెలిపారు.

 

అయితే దీనికి స్పందించిన ఆరోగ్యశ్రీ ట్రస్టు.. పెండింగ్ లో ఉన్న బిల్లులను సోమవారం నుంచి చెల్లించనున్నట్టు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఎం.చంద్రశేఖర్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ బిల్లులు చెల్లిస్తున్నామని, సేవలను నిరంతరాయంగా కొనసాగించాలని కోరారు.