భగత్​ సింగ్​ ఉరితీతను రిహార్సల్..  ప్రాణాలు కోల్పోయిన 9 ఏళ్ల బాలుడు!

భగత్ సింగ్ ఆ  పేరు చాలు. పాలు తాగే పిల్లవాడు సైతం పులిలా  ఎగిరి దూకడానికి, సింహంలా గర్జించడానికి, ప్రతి భారతీయుడి  ఒంటిమీద వెంట్రుకలు నిక్కబొడుచుకోవడానికి. గుండెల్లో దేశభక్తి ఉప్పొంగడానికి.ఆ  విప్లవ వీర కిశోరం మీద దేశవ్యాపితంగా  సినిమాలు వచ్చాయి.. వీధి నాటకాలూ జరిగాయి. ఆయన త్యాగాన్ని స్కూళ్లు, కాలేజీల్లో స్టేజీపై విద్యార్థులూ నాటకాల రూపంలో చేసి చూపించారు. ఇప్పటికే కాదు ఎప్పటికి గుర్తుండిపోయే సాహసం భగత్ సింగ్ మరణం.

అయితే, తాజాగా ఉత్తరప్రదేశ్ లో భగత్ సింగ్ నాటకం రిహార్సల్స్ లో విషాదం చోటు చేసుకుంది. శివమ్ అనే ఓ 9 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. బుదౌన జిల్లాలోని బబత్ లో ఈ ఘటన జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్కూల్ లో భగత్ సింగ్ నాటకాన్ని ప్రదర్శించేందుకు శివమ్, అతడి స్నేహితులు నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే భగత్ సింగ్ గా శివమ్  నటించాలనుకున్నాడని అతడి బంధువులు చెప్పారు.

నాటకం చివర్లో ఉండే ఉరితీత సీన్ రిహార్సల్స్ లో భాగంగా తాడు తీసుకొచ్చిన శివమ్.. ఉరి తాడుగా కట్టి మెడకు చుట్టుకున్నాడని, దురదృష్టవశాత్తూ స్టూల్ నుంచి కాళ్లు జారడంతో మెడకు ఉరి బిగుసుకుందని తెలిపారు. అయితే, ఊపిరాడక గిలగిల కొట్టుకుంటున్న శివమ్ ను చూసి అతడి మిత్రులు.. బాగా నటిస్తున్నాడనుకున్నారని, శివమ్ లో కదలికలు పూర్తిగా ఆగిపోయాక అనుమానపడ్డారని చెప్పారు. 

వెంటనే గ్రామస్థులకు ఆ విషయాన్ని తెలియజేయగా.. అప్పటికే శివమ్ చనిపోయాడన్నారు. అయితే, దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, అంత్యక్రియలు చేశామని అతడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. కాగా, గత ఏడాది మధ్యప్రదేశ్ లోని మంద్సౌర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పాపం ఆ పసివాడు ఇంకా  ఎంతో జీవితం చూడాల్సిన ఆ బాలుడు. భగత్ సింగ్ సాహసాన్ని.. ఆయన తెగువను నేటి తరానికి చూపించాలని ఆశపడ్డ అతని ఆశలు నిరాశలు అయ్యాయి. నేటి తరం పిల్లలు యూట్యూబ్ తెలుసు అందులో రైమ్స్ తెలుసు గానీ భగత్ సింగ్ ఎవరికి తెలియదు.. ఆయన చేసిన త్యాగం అంతకన్నా తెలీదు. అలాంటిది 9 బాలుడు అతని గురించి నాటకం వేయాలి అనుకోవడం చాలా గ్రేట్ కానీ ఏం చేస్తాం తెలియని తనం కావచ్చు. ఆ బాలుడు చేసిన చిన్న తప్పుకావొచ్చు చివరికి 
ఆ బాలుడి ప్రాణాలకే ముప్పు వచ్చింది.