Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కవిత కాళ్ల దగ్గర..మోకాళ్లపై కూర్చొన్న ఐఏఎస్
posted on: Jan 27, 2017 1:55PM

పవర్‌లో ఉన్న వారికి వంగి వంగి సాష్టాంగ నమస్కారం చేసేందుకు చోటా మోటా నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పోటీ పడుతుంటారు..అధికార గణం కూడా ఇందుకు మినహాయింపు కాదు..అయితే బయటకు మాత్రం ఈ విషయం తెలియకుండా జాగ్రత్తగా మెయింటెన్ చేస్తుంటారు.ఈ జాబితాలో సాధారణ అధికారులే కాదు ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండే ఐఏఎస్‌లు రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో, వారి కాళ్ల దగ్గర మాత్రం ఉండకూడదు..
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవం సాక్షిగా ఇద్దరు అధికారులు ఐఏఎస్‌ల పరువు తీశారంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జగిత్యాల 'ఖిల్లా’లో తొలి గణతంత్ర వేడుకలను నిర్వహించే అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారికి.. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అనడంతో సభలో కలకలం రేగింది.
ఇది జరిగిన కాసేపటికే మెట్‌పల్లి సబ్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఏకంగా గ్యాలరీలో ఉన్న సీఎం కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత దగ్గరికి వెళ్లి ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చోని ముచ్చటించడంతో వేదికపై ఉన్న వారు, ప్రజలు అవాక్కయ్యారు. దీంతో నిన్న మొత్తం కలెక్టర్ శరత్..సబ్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ వ్యవహారంపైనే అంతా చర్చించుకున్నారు. ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల్లా మారిపోయి ఐఏఎస్ అన్న పేరుకు తలవంపులు తీసుకొచ్చారంటూ కొందరు విమర్శిస్తున్నారు.



.jpg)


