ఎగ్జిట్ పోల్స్ ను వమ్ము చేసి ఎగ్జాక్ట్ పోల్స్ లో దుమ్మురేపుతున్న కాషాయ దళం!

posted on: Mar 11, 2017 9:52AM


ఎగ్జిట్ పోల్స్ కి ఎగ్జాక్ట్ పోల్స్ కి చాలా తేడా వుంటుందని మరోసారి నిరూపించింది యూపీ! నిన్నటి దాకా అందరూ ఉత్తర్ ప్రదేశ్ బీజేపీదే అంటే ... ఇవాళ్ల ఉదయం నుంచీ అదే నిజమవుతోంది. కాని, ఎగ్జిట్ పోల్స్ చెప్పిన రాజకీయ జ్యోతిష్యుల అంచనాల ప్రకారం మాత్రం ట్రెండ్స్ కనిపించటం లేదు! దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించటమే కాదు... కమలం స్వంత మెజార్జీ కూడా సంపాదించే దిశగా సాగుతోంది! కేవలం రెండు సర్వేలు మాత్రమే ఇలాంటి భారీ విజయం మోదీ సేనకు లభిస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో చెప్పాయి. ఇప్పుడు వాటి అంచనాలే నిజం అవుతున్నాయి! ఉత్తర్ ప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ 202 అయితే ఆల్రెడీ బీజేపి 275స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది!

 

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల క్రిందులు చేయకున్నా సస్పెన్స్ సినిమాలా సాగుతోన్న రాష్ట్రాలు గోవా, మణిపూర్! రెండూ చిన్న రాష్ట్రాలే అయినప్పటికీ ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ చేతిలో వున్నాయి. రెండు చోట్లా అధికార పక్షాలు మళ్లీ పవర్ నిలుపుకుంటాయా అన్నది అనుమానంగా వుంది. అలాగని అధికారం చేజారే స్థితిలో కూడా స్పష్టంగా లేవు! గోవాలో బీజేపి, కాంగ్రెస్ 7, 9 సీట్లలో ఆధిక్యంలో వుంటూ హోరాహోరిగా పోరాడుతుంటే మణిపూర్ లో కాంగ్రెస్ 14, బీజేపి 6 స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి. మణిపూర్ లో ఆ మాత్రం విజయం కూడా బీజేపికి ప్లస్సే! అక్కడ గతంలో కమలం పర్ఫామెన్స్ కొంచెం కూడా ఆశాజనకంగా వుండేది కాదు!

 

ఇక ఉత్తర్ ప్రదేశ్ లో ఊపులో వున్న మోదీ దళానికి ఏకైకా డిజపాయింట్ మెంట్ పంజాబ్! అక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ సృష్టించినంత దారుణమైన స్థితిలో అకాళీ, బీజేపీ కూటమి లేకున్నా అధికారం మాత్రం నో ఛాన్స్! కాంగ్రెస్ 63స్థానాల్లో ఆధిక్యంతో ఆల్రెడీ సీఎం కూర్చీపై కర్చీఫ్ వేసేసింది! కాగా పంజాబ్ లో ఆప్ అల్లాడిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా అంత సీన్ కనిపించటం లేదు. ఓడిపోతున్న బీజేపి, అకాళీ దళ్ కూటమి కంటే వెనుకబడి వుంటూ కేజ్రీవాల్ పార్టీ 21 స్థానాల్లో ఆధిక్యం చూపుతోంది. జేబీపీ, అకాళీ 26 స్థానాల్లో ముందున్నాయి. పంజాబ్ లో ఎదురైన చేతు ఉత్తరాఖండ్ లో తీపిగా మారింది బీజేపికి. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కమలానిదే విజయమని ముందు నుంచే చెప్పాయి. కాని, ఇక్కడ కూడా జనం 56 సీట్లలో ఆధిక్యాన్నిచ్చి స్పష్టమైన భారీ విజయం ఇచ్చేశారు. కాంగ్రెస్ కేవలం 15 చోట్ల మాత్రమే పట్టు చూపిస్తోంది. ఇంతటి సక్సెస్ పోల్స్ పసిగట్టలేకపోయాయి!

 

ఏది ఏమైనా యూపీ విజయంతో బీజేపి ఇక దేశంలో అతి పెద్ద, అతి బలమైన జాతీయ పార్టీగా అవతరించబోతందని చెప్పొచ్చు!

google-ad-img
    Related Sigment News
    • Loading...