కాల్షియం అందించే ఆహారం...

 

వయస్సు పెరుగుతున్న కొద్ది ఎముకలు పటిష్టత తగ్గుతుంది.మీ ఎముకలు పటిష్టంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారం లో 5 రకాల ఆహార పదార్ధాలను తప్పకుండా తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని కొంత మేర నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.వయస్సు పెరిగే కొద్ది శరీరంలో కాల్షియం తగ్గనివ్వకూడదు నిపుణుల సూచనలను పాటించండి.   ఎముకలు,పళ్ళలో 99% కాల్షియం ఉంటుంది.శరీరంలో కాల్షియం ఉంటేనే ఇతర పనులు చేసేందుకు సహకరిస్తుంది.అందుకే ఎక్కువసార్లు ప్రతి నేలా పరీక్షలు నుర్వహిస్తూ ఉండాలి.అసలు శరీరంలో కాల్షియం లేక పోతే పోషక ఆహార లోపం కూడా ఉన్నట్టే.

శరీరం లో కాల్షియం లోపిస్తే ఉండే లక్షణాలు ఇవే...

1 )ఎముకలలో నొప్పి బలహీనంగా ఉండడం.
 2)కండరాలు  పట్టు కుపోవడం.
౩ )కాళ్ళు,చేతులు తిమ్మిరి పట్టడం.
4)నడిచినప్పుడు అలసట లేదా నడవడం ఇబ్బందిగా ఉండవచ్చు.
5)స్త్రీలలో నెలసరి సమస్యలు.
6)పళ్ళు బలహీనంగా ఉండడం.

కాల్షియం అందించే ఆహార పదార్ధాలు ఇవే...

ఆకు కూరలు...

ఆకు కూరలలో కాల్షియం పొందవచ్చు.కాల్షియం లోపాన్ని సవరించేందుకు ఆకు కూరలు తప్పనిసరిగా తీసుకోవాలి.ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఎముకలు గట్టి పడడమే కాకుండా పెరుగు తాయి.

పెరుగు...

పెరుగు ఉత్తమ మైన ప్రోటీన్లలో పెరుగు ఒకటి. పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.పెరుగు ద్వారా లభించే మంచి బ్యాక్టీరియా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.మనం ఆరోగ్యంగా ఉండాలంటే 227 గ్రాముల పెరుగులో 4౦౦ మిల్లి గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.పెరుగును అల్పాహారం గా తీసుకో వచ్చు.

పన్నీర్...

పన్నీర్ ద్వారా కాల్షియం లోపాన్ని తగ్గించ వచ్చు.పనీర్ లో పరిపూర్ణ మైన స్థాయిలో సంపూర్ణంగా కాల్షియం లభిస్తుంది.ప్రతిరోజూ పన్నీర్  దాదాపు 1౩౦ మిల్లి గ్రాములు కాల్షియం లభిస్తుంది.

ఓట్స్...

శరీరానికి కాల్షియం అందించాలంటే ఓట్స్ తీసుకోవడం చాలా మంచిది.ఓట్స్ తీసుకోవడం ద్వారా కాల్షియం లభిస్తుంది.ఒక కప్పు ఓట్స్ తినడం ద్వారా దాదాపు 1౦౦ నుండి 15౦ మిల్లిగ్రాముల కాల్షియం శరీరానికి అందించ వచ్చు.మీ శరీరానికి సంపూర్ణంగా కాల్షియం లభించడం వల్ల ఎముకలు కండరాలు పటిష్టంగా ఉంటాయి.