ఫార్ములా ఈ కార్ రేసులో  కెటీఆర్ పై నాన్ బెయిలబుల్ కేసు 

తెలంగాణలో మరో సంచలనం జరిగింది. ఫార్ములా ఈ కార్  రేస్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ పై కేసు నమోదయ్యింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రదానకార్యదర్శి శాంతకుమారి ఎసిబికి  రాసిన లేఖ ప్రకారం ఎసిబి కేసు నమోదు చేసింది. ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. ఎ1 గా కెటీఆర్, ఎ 2గా అరవింద్  కుమార్ , ఎ 3గా బిఎన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.  గత కొంతకాలంగా  కెటీఆర్ అరెస్ట్ అనే వార్తలు గుప్పు మంటున్నాయి. తాజాగా కేబినెట్ భేటీలో ఫార్ములా ఈ  కార్ రేస్ లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. విదేశాల్లో ఉన్న కంపెనీకి నిబంధనలను ఉల్లంఘించి నిధులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ప్రభుత్వం అభియోగాలు మోపింది. కెటీఆర్ పై నాలుగు సెక్షన్ల క్రింద కేసులు నమోదుచేశారు. ఇప్పటికే గవర్నర్ ఆమోదం తెలపడంతో కెటీఆర్ పై కేసు నమోదయ్యింది
Publish Date: Dec 19, 2024 4:56PM

అప్రతిహతంగా  ముగిసిన నారాలోకేశ్ యువగళం  యాత్ర

రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఇది. యువగళం నేత మంత్రి నారాలోకేశ్ ఈ యాత్ర చేపట్టి గురువారానికి 3132 కిలో మీటర్లకు చేరుకుంది. కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. 226 రోజుల పాటు యాత్ర కొనసాగింది. గురువారానికి అంటే డిసెంబర్ 19 నాటికి  ఈ యువగళం యాత్ర  ముగిసింది.  ఎపిలోని 97 నియోజకవర్గాలు చుట్టుముట్టింది. యువగళం నేత ఈ యాత్ర ప్రారంభం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  సవాళ్లను స్వీకరించిన నేతగా నిలిచారు. పేదరికం, నిరుద్యోగం, అవినీతి, వైకాపా అవినీతికి వ్యతిరేకంగా యాత్ర సాగింది.   పాద యాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని నారాలోకేశ్ ముగింపు వేడుకలో అన్నారు. టిడిపి, జనసేన నేతలు భారీగా ఈ కార్యక్రమానికి తరలిరావడంతో  అంగెనపూడి పసుపు సంద్రంగా తయారయ్యింది. ఈ ఏడాది జనవరి 27న యాత్ర ప్రారంభమైంది. చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాద యాత్ర అంగెనపూడిలో ముగిసింది. అదే సెంటిమెంట్ తో లోకేశ్ కూడా అక్కడే ముగించారు.  యువగళం తొలి రోజు నుంచి  అప్పట్లో అధికారంలో ఉన్నవైకాపా ప్రభుత్వం  అవరోధాలు కలిగించింది. జీవో నెంబర్ 1 అడ్డుపెట్టుకుని అరాచకాలు చేసింది. తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల సమయం, చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో యువగళం యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. కుప్పంలో ఈ యాత్ర ప్రారంభమై తంబెళపల్లి చేరుకునే లోపు వైకాపా ప్రభుత్వం నారాలోకేశ్ పై 25  అక్రమ కేసులు బనాయించింది. పోలీసులు, వైకాపా శ్రేణులు తెదాపా శ్రేణులపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి.  40 మంది యువగళం వాలెంటీర్లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.  గన్నవరం నియోజకవర్గంలోని 46 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. విదేశాల్లో ఉన్న వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. అనేక ఆటు పోట్లను అధిగమించిన ఈ యాత్ర ముగిసిన  సంధర్భంగా మా యువ నాయకుడు  నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.  
Publish Date: Dec 19, 2024 4:20PM

పేర్ని జయసుధ బెయిల్ పిటిషన్ ఈ నెల20కి వాయిదా 

వైకాపా నేత పేర్ని నాని భార్య పేర్ని జయసుధ రేషన్ బియ్యం మాయం కేసులో గురువారం మచిలీపట్నం కోర్టులో విచారణ జరిగింది. పేర్ని నాని భార్యకు చెందిన గోదాములో రేషన్ బియ్యం నిల్వలు ఉండేవి. కాకినాడ పోర్టులో  విదేశాలకు తరలిస్తున్న రేషన్  బియ్యం పట్టుపడిన సంగతి తెలిసిందే. జయసుధ గోదాములో నుంచి 185 టన్నులు మాయం కావడంపై ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. బందరు పోలీస్ స్టేషన్ లో పేర్నినాని భార్య  పేరు మీద క్రమినల్ కేసు నమోదైంది. జయసుధ అరెస్ట్ పక్కా అని తెలియడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 16న విచారణ చేపట్టిన న్యాయస్థానం  పోలీసుల నుంచి సిడిఫైల్ రాకపోవడంతో విచారణ ఈ నెల 19కి వాయిదాపడింది. తాజాగా శుక్రవారానికి వాయిదా పడినట్లు సమాచారం  పేర్ని వైకాపాలో కీలక నేత కావడంతో రేషన్ బియ్యం గుట్టు కాలేదు. పౌరసరఫరా అధికారులు  కూడా రేషణ్  బియ్యం పట్టుకోవడంలో వైఫల్యం చెందారు.  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక తీగలాగితే డొంక కదిలింది. 
Publish Date: Dec 19, 2024 12:38PM

కాళేశ్వరం కమిషన్ ఎదుట  స్మితా సబర్వాల్ 

పదేళ్ల బిఆర్ ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఓ కారణం, సరిగ్గా  ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు కుంగిపోయాయి. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని భావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఇంజినీర్లను మాత్రమే విచారణ చేసిన కమిషన్ బుధవారం  నుంచి  ఐఏఎస్ అధికారులను విచారిస్తుంది. రెండో రోజు కూడా విచారణ కొనసాగింది.  ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను కమిషన్ విచారణ చేసింది. ఆమె బిఆర్కే భవన్ లో జరిగిన విచారణకు హాజరయ్యారు. బుధవారం విచారణ కమిషన్ ఎదుట  రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రజత్ కుమార్, ఎస్ కె జోషి హాజరయ్యారు. 
Publish Date: Dec 19, 2024 11:02AM

చలికాలంలో ఈ తప్పులు చేశారంటే.. గుండ్రాయిలా మారిపోతారు జాగ్రత్త..!

  సీజన్ ఏదైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.  అయితే సీజన్ కు తగ్గట్టు జీవనశైలి,  ఆహార వేళలు,  శారీరక చురుకుదనం మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో చాలామంది జీవనశైలి చాలా బద్దకంగా మారుతుంది.  దీని వల్ల బరువు పెరిగి గుండ్రాయిలా మారిపోతారని అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.  ఇంతకీ చలికాలంలో చాలామంది చేసే తప్పులేంటో తెలుసుకుంటే.. చలికాలంలో శారీరక శ్రమ తగ్గిపోతుంది.  ఉదయం ఎంత సేపైనా చలి తగ్గదు.. సాయంత్రం చాలా తొందరగా చలి వచ్చేస్తుంది.  ఈ కారణాల వల్ల ఇంటి పనులు,  ఉద్యోగం చేసుకోవడంతో రోజును గడిపేస్తుంటారు.  పైగా చలి కారణంగా తొందరగా తెల్లవారదు,  సాయంత్రం తొందరగా చీకటి పడుతుంది.  దీని వల్ల శరీరం బరువుగా అనిపిస్తుంది. ఇది కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది. చలికాలంలో చలి నుండి ఉపశమనం కోసం వేడివేడిగా పకోడాలు,  సమోసాలు, మిర్చి బజ్జీలు బేకరీ ఆహారాలు ఎడాపెడా తింటారు. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.  వీటిని ఎక్కువ తినడం వల్ల  బరువు పెరుగుతారు. చలికాలంలో చలి కారణంగా తొందరగా నిద్ర లేవరు.  దీని వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది.  ఎక్కువ సేపు నిద్రపోవడానికి కేటాయిస్తారు. దీని వల్ల బద్దకం పెరుగుతుంది. సాధారణ సమయంలో 7,8 గంటలు నిద్రపోతే చలికాలంలో 10 గంటల వరకు నిద్రపోయే వారు ఉంటారు. దీని వల్ల బరువు పెరుగుతారు. చలి కారణంగా చల్లని వాతావరణంలో నీరు తాగడం మరచిపోతుంటారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. చలికాలంలో శరీరంలో హార్మోన్ల మార్పులు  ఏర్పడతాయి.  దీని కారణంగా జీవక్రియ మందగిస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. అంతేకాదు.. చలికాలంలో సీజనల్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువగా తినేస్తారు. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది.                            *రూపశ్రీ.
Publish Date: Dec 19, 2024 9:30AM

శనగపిండి ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

శనగపిండి భారతీయులు ఉపయోగించే పిండులలో ఒకటి.  శనగపిండిని పిండి వంటల నుండి,  కూరలు,  స్నాక్స్ వంటివి తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తారు.  ముఖ్యంగా పకోడీలు, బజ్జీలు చేయడానికి శనగపిండి కావాల్సిందే. అయితే శనగపిండికి తొందరగా పురుగులు పడతాయి. పురుగులు పట్టిన పిండిని వాడుకోవడం అంటే ఎవరికీ నచ్చదు. ఎంత జల్లించి వాడుకోవాలని చూసినా అది  అంత ఆరోగ్యం కూడా కాదు. అలా కాకుండా శనగపిండి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అదే విధంగా శనగపిండి ఉపయోగాలు కూడా తెలుసుకుంటే. శనగ పిండి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్,  విటమిన్ B6 వంటి అనేక పోషకాలు శనగపిండిలో ఉంటాయి. దీని కారణంగా ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది, ముఖ్యంగా కండరాలను బలోపేతం చేయడంలో,  జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. టైట్ కంటైనర్.. గాలి చొరబడని డబ్బాలో గాలి,  తేమ తగలకుండా ఉండేలా శనగపిండిని నిల్వచేయాలి. ఇది శనగపిండి తాజాదనాన్ని,  రుచిని తగ్గకుండా చేస్తుంది. చల్లని, పొడి ప్రదేశం.. శనగ పిండిని చల్లని,  పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. తేమతో కూడిన ప్రదేశంలో ఉంచడం వల్ల దానిలో ఫంగస్ లేదా కీటకాలు పెరుగుతాయి. దాని కారణంగా అది చెడిపోతుంది. ఫ్రిడ్జ్ లో.. శనగ పిండిని ఎక్కువ కాలం నిల్వ చేయవలసి వస్తే, దానిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఇది పురుగు పట్టకుండా చేస్తుంది. సిలికా జెల్ ప్యాక్.. కంటైనర్‌కు సిలికా జెల్ ప్యాక్‌లను జోడించావి. ఇది తేమను గ్రహిస్తుంది. శనగ పిండిని పొడిగా ఉంచుతుంది. దీని వల్ల శనగపిండి త్వరగా పాడవదు. సూర్యకాంతి.. శనగ పిండికి డైరెక్ట్ సన్ లైట్ తగలకుండా చూసుకోవాలి. నేరుగా  ఎండలో ఉంచడం వల్ల అందులో తేమ పేరుకుపోయి శనగ పిండి త్వరగా పాడవుతుంది. స్పూన్.. శనగపిండిని బయటకు తీయడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన  పొడి చెంచాను ఉపయోగించాలి. ఇలా చేస్తే అందులో తేమ తగలదు.  పిండి కూడా శుభ్రంగా ఉంటుంది. కొనుగోలు.. కొత్త శనగ పిండిని కొనుగోలు చేసే ముందు దాని తాజాదనాన్ని,  ప్యాకేజింగ్‌ను తనిఖీ చేయాలి.  అందులో తేమ లేదా కీటకాలు లేవని నిర్ధారించుకోండి.                                          *రూపశ్రీ.
Publish Date: Dec 19, 2024 9:30AM