Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...15 సూత్రాల శాంతి ప్రణాళిక.. ఇరాన్ తో యుద్ధానికి స్వస్తికి ట్రంప్ ప్రతిపాదన
posted on: Mar 25, 2026 9:15AM

ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలకు స్వస్తి పలికేందుకు, యుద్ధానికి తెర దించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. 15 సూత్రాలతో కూడిన ఒక భారీ శాంతి ప్రణాళిక ఇరాన్ తో గత నెల రోజులుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపే దిశగా కీలక ముందడుగు అని చెపపవచ్చు. అయితే ఈ శాంతి ప్రణాళికకు ఆయన విధించిన షరతులపై ఇరాన్ ఏవిధంగా స్పందిస్తుందన్నది వేచి చూడాలి. అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నది ఆ శాంతి ప్రణాళికలో ప్రధాన షరతు.
ఈ శాంతి ప్రణాళికను అగ్రరాజ్యాధినేత పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌కు చేరవేశారు. ఇరాన్ తన మూడు ప్రధాన అణు కేంద్రాలైన నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలను పూర్తిగా మూసివేయాలి. యురేనియం శుద్ధిని నిలిపివేసి, ఇప్పటివరకు శుద్ధి చేసిన అణు ఇంధనాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)కు అప్పగించాలి. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని కూడా నిలిపివేయాలని ఆ శాంతి ప్రణాళికలో ట్రంప్ పేర్కొన్నారు.
అక్కడితో ఆగకుండా శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ షరతులకు అంగీకరించి ఇరాన్ శాంతికి ముందుకు వస్తే.. ఇరాన్‌పై అన్ని అణు సంబంధిత ఆంక్షలను ఎత్తివేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు,
విద్యుత్ ఉత్పత్తి కోసం బుషెహర్‌లో పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తుందని కూడా భరోసా ఇచ్చారు. దీనిపై ట్రంప్ ఇరాన్ ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నది. అణ్వాయుధాన్ని ఎప్పటికీ సమకూర్చుకోకుండా ఉండేందుకు కూడా అంగీకరించిందని చెప్పారు. అని పేర్కొన్నారు.


.webp)



