Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పచ్చబొట్టు వేయించుకునే ఆలోచనలో ఉన్నారా.. ఇదెంత డేంజరో తెలుసా.!
posted on: Jul 31, 2026 10:16AM

పచ్చబొట్టు ప్రజల జీవితాలలో భాగమైపోయి కొన్ని వందల, వేల సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు పచ్చబొట్టును ప్యాషన్ లో భాగంగా మార్చేశారు. పచ్చబొట్టును కొత్తగా టాటూ అని పిలుస్తున్నారు. ఈ టాటు పచ్చబొట్టుకు అప్డేడ్ వెర్షన్ అనుకోవచ్చు. పచ్చ బొట్టు గురించి కవులు ఎన్నో పాటలు కూడా రాశారు. నేటికాలంలో పచ్చబొట్టును చాలా కొత్తగా వేయించుకోవడం మాత్రమే కాకుండా చాలా కామన్ విషయంగా కూడా అయిపోంది. చాలామంది తమ అభిరుచి కారణంగా టాటూలు , పియర్సింగ్‌లు చేయించుకుంటున్నారు. ఈ టాటూలు లేదా పియర్సింగ్‌ల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని అనుకుంటారు. అయితే ఇది పూర్తీ నిజం కాదు.. బాడీ ఆర్ట్ గా పిలువబడే పచ్చబొట్టు లేదా టాటు.. కాలేయాన్ని తీవ్రమైన ప్రమాదంలో పడేస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
బాడీ ఆర్ట్.. కాలేయానికి జరిగే హాని..
టాటు వేయించుకుంటే ఫ్యాషన్ లో భాగంగా కొత్తగా కనిపించవచ్చు అనుకుంటారు. అయితే ఈ ఫ్యాషన్ కాలేయానికి ప్రమాదాన్ని పెంచుతుందని చాలా తక్కువ మందికి తెలుసు. టాటూ వేసినప్పుడు రక్తం వల్ల హెపటైటిస్ బి , హెపటైటిస్ సి అనే వైరల్ ఇన్ఫెక్షన్లు కాలేయంపై నేరుగా దాడి చేస్తాయట. ఇవి వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం రక్త ఇన్ఫెక్షన్ కారణం అని చెబుతున్నారు.
టాటూ నీడిల్స్..
టాటూ ఆర్టిస్ట్ లు శుభ్రపరచని సూదులను లేదా అవే పరికరాలను పదేపదే ఉపయోగిస్తే, వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందట. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, హెపటైటిస్ లక్షణాలు సంవత్సరాల తరబడి బయటపడకపోవచ్చని, ఈ కారణంగా ఇది ఎటువంటి సంకేతాలు లేదా లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా కాలేయాన్ని దెబ్బతీసి, సిరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు రావడానికి కారణం అవుతుందని అంటున్నారు.
పచ్చబొట్టు వేయించుకొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
మార్కెట్‌లో లైసెన్స్ పొంది, మంచి పేరున్న స్టూడియోలకు మాత్రమే వెళ్లాలి, పార్టీలో లేదా ఇంట్లో టాటూ వేయించుకోవడం మంచిది కాదు.
టాటూ ఆర్టిస్ట్ లను, వారి సెటప్ ను జాగ్రత్తగా పరిశీలించాలి. వారు కొత్త, క్రిమిరహితం చేసిన సూదులను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాతే టాటూ వేయించుకోవాలి. అంతేకాదు.. వీటి గురించి ఏమైనా సందేహాలు ఉంటే వారిని అడిగి సందేహాలు తీర్చుకున్న తర్వాతే టాటూ వేయించుకోవాలి.
టాటూ వేయడానికి ఉపయోగించే ఇంక్ ఒక చిన్న, ఒకేసారి వాడే కప్పులో ఉండాలి. అలాగే, టాటూ ఆర్టిస్ట్ సూదిని నేరుగా పెద్ద సిరా సీసాలో ముంచకూడదు. ఎందుకంటే, ఒకే సీసాను పదేపదే వాడటం వల్ల సిరా డబ్బా మొత్తం కలుషితం కావచ్చు.
టాటూ ఆర్టిస్ట్ చేతులు కడుక్కొని, ఆ తర్వాత కొత్త డిస్పోజబుల్ గ్లౌజులు ధరించాలి. అలా ఉండే టాటూ ప్రాసెస్ శుభ్రంగా ఉన్నట్టు.
జాగ్రత్త..


.webp)



