Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ తల్లి.. శంకరన్న లొల్లి!
posted on: Nov 30, 2013 9:18AM
.jpg)
తెలుగువారి ఐకమత్యానికి స్ఫూర్తిప్రదాతగా నిలిచే ఒక అద్భుతమైన భావన తెలుగుతల్లి. తెలుగుతల్లిని కన్నతల్లిలా భావించే తెలుగుజాతిలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు బయలుదేరి జాతిని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. వారి విచ్ఛిన్నకర కార్యకలాపాలు తెలుగుతల్లిని అవమానించడంతోనే ప్రారంభమయ్యాయి. తెలుగుతల్లి కాన్సెప్ట్ ని కాపీకొడుతూ ‘తెలంగాణతల్లి’కి రూపకల్పన చేశారు. తెలంగాణ అంతటా ఎక్కడ పడితే అక్కడ మురుక్కాలవ పక్కన, చెత్తకుండీ పక్కన తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ తాము తల్లిగా భావిస్తున్న మూర్తినే అవమానిస్తున్నారు.
ఇదిలా వుంటే తెలంగాణ తల్లి ఆహార్యం గురించి ఎన్నో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుబడిదారులు, ధనికులకు ప్రతినిధిగా అత్యంత ఆడంబరంగా వుందన్న విమర్శలు వినిపించాయి. అలాగే కేసీఆర్ కుమార్తె కవిత పోలికలు తెలంగాణ తల్లిలో కనిపిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ ఆల్రెడీ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ యోధురాలు చాకలి ఐలమ్మను గుర్తు చేసేలా వుండాలే తప్ప కవితను గుర్తు చేసే విధంగా వుండాలని ఆయన డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు.
ఇప్పుడు తెలంగాణ తల్లికి మరికొన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ఆ కష్టాలకు కారణం ఎవరో కాదు... కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరన్న. సోనియాగాంధీకి గుడి కట్టి తీరతానని శపథం చేసిన శంకరన్న తాజాగా ఓ సరికొత్త స్టేట్‌మెంట్ పడేశారు. తెలంగాణ తల్లి అంటే వేరే ప్రత్యేకంగా ఎవరో కాదంట.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీనే తెలంగాణ తల్లి అట! మితిమీరిపోయిన వ్యక్తిపూజకి ఇంతకంటే పరాకాష్ట మరొకటి వుంటుందా? ఈలెక్కన పొరపాటున తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ తల్లి పరిస్థితి ఏమైపోతుందో! టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వీధివీధిలో ఏర్పడే తెలంగాణ తల్లి విగ్రహాలలో కవితమ్మని చూసుకునే అదృష్టం కలుగుతుంది. అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని రద్దు చేసి తెలంగాణ తల్లి పేరుతో సోనియాగాంధీ విగ్రహాలనే పెట్టేస్తారు. ఏదో కామెడీకోసం రాశారుగానీ నిజంగా అలా జరుగుతుందా అనుకుంటున్నారా.. పొరపాటున కూడా అలా అనుకోకండి. తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడితే ఆ రాష్ట్రంలో ఏదైనా జరగొచ్చు!






