Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ని ట్విట్టిపోసిన వర్మ!
posted on: Dec 8, 2013 9:58AM

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెంటిమెంట్స్ వుండవని అందరూ అనుకుంటారు. ఆయన కూడా తనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవని చెబుతూ వుంటారు. అయితే అది పూర్తిగా నిజం కాదేమో, వర్మ మనసులో ఏదో మూల సెంటిమెంట్ వుందేమో అని ట్విట్టర్‌లో ఆయన పెట్టే కామెంట్లను చూస్తే అనిపిస్తూ వుంటుంది. వర్మ ప్రదర్శించే ఆ సెంటిమెంట్ కూడా తన వ్యక్తిగత విషయాల్లో లేదు... ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం విషయంలో వుంది. తెలుగువారందరూ ఒక్కటిగానే వుండాలన్న ఆలోచనలో వుంది.
రామ్ గోపాల్ వర్మ గతంలో అనేక పర్యాయాలు రాష్ట్రం విడిపోకూడదన్న అర్థం వచ్చేలా ట్విట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. అమెరికాలో కేసీఆర్ లాంటి వ్యక్తి లేకపోవడం వల్లే అక్కడ విభజన రాజకీయాలు లేవని కామెంట్ చేశారు. కేసీఆర్ అమెరికాకు తన మకాం మార్చి అమెరికా పౌరులకు విభజన పాఠాలు చెప్పాలని సూచించారు.
కేసీఆర్ లాంటి నాయకులు అమెరికాని విభజించాలని వాదించి గెలవగలరని పేర్కొన్నారు. అమెరికా లాంటి పెద్ద దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమాలు జరగలేదని, ఎందుకంటే అక్కడ కేసీఆర్ లాంటి ‘సమర్థుడైన’ నాయకులు లేకపోవడమే కారణమని వర్మ ట్విట్ చేశారు. కేసీఆర్ అమెరికా పౌరుడిగా పుట్టి వుంటే ఆయన ఏం సాధించేవారో చూడాలని వుందని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కామెంట్ పోస్ట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ మీద ట్విట్టర్‌లో చాలా పోస్టులు ట్విట్ చేశారంటే రాష్ట్ర విభజన అంశం ఆయన్ని ఎంతగా బాధిస్తోందో తెలుస్తోంది.
ముంబైలో సెటిలైపోయిన వర్మకే ఇంత బాధగా వుంటే, అన్నిటిలోనూ హైదరాబాద్ మీదే ఆధారపడిన సీమాంధ్ర ప్రజలకు ఎంత బాధగా వుంటుంది? విద్యార్థులు, ఉద్యోగులు ఎంత బాధపడతారు? ప్రతి తెలుగు హృదయం ఎంత తల్లడిల్లుతుంది? అన్నట్టు.. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా అమెరికాలో పుట్టి వుంటే ఎలా వుండేదంటే.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ప్రజలందరూ ఎప్పటికీ అన్నదమ్ముల్లా కలసి మెలసి వుండేవారు. మరి కేసీఆర్ అమెరికాలో పుడితే.... మన ఒక్క రూపాయికి వెయ్యి అమెరికా డాలర్లు వచ్చేలా పరిస్థితి తయారై వుండేది.


.png)



