నానో చిప్స్ కాదు... జస్ట్ 'పులిహోర'!

posted on: Nov 10, 2016 3:34PM

 

నానో చిప్ అంటే ఏంటో మీకు తెలుసా? ఆ ఏముంది... నానో కార్ లో కూర్చుని చిప్స్ తినటం అంటారా! అస్సలు కాదు! ఈ మద్య సోషల్ మీడియాలో నానో చిప్ గురించి స్పైసీ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా, మోదీ పెద్ద నోట్లు రద్దు చేశాక ఇంకా బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ నానో చిప్ సంగతేంటంటే... రద్దైన 5వందల నోట్లు స్థానంలో మళ్లీ కొత్తవి రాబోతున్నాయి. అలాగే సరికొత్త టూ థౌజెండ్ నోట్స్ కూడా చెలామణి అవుతాయట! అయితే ఈ రెండు వేల రూపాయల నోట్లలో నానో చిప్స్ వుండబోతున్నాయన్నది ఇప్పుడు అందరికీ పెద్ద ఆసక్తిగా మారిపోయింది!


నానో చిప్ అంటే కొత్తగా రానున్న నోట్లలో పెట్టే ఒక చిన్న పరికరం! ఇది కరెన్సీ నోట్లలో వుండటం వల్ల ఆకాశంలో చక్కర్లు కొట్టే ఉపగ్రహాలు వెంటనే సదరు నోట్ ఎక్కడ వుందో పసిగ్గట్టేస్తాయట! అంటే సాటిలైట్ నుంచి వచ్చిన సిగ్నల్ మన నోట్లలో వుండే నాన్ చిప్ రిసీవ్ చేసుకుని రెస్పాండ్ అవుతుంది. వెంటనే ఆ సిగ్నల్ పసిగట్టిన సాటిలైట్ మనకు ఎన్ని నోట్లు, ఎక్కడ, ఎంత లోతున వున్నాయో చెప్పేస్తుందట! ఒకటి రెండు కాదు ఏకంగా 150మీటర్ల లోతున డబ్బులు పాతేసినా ఇట్టే దొరికిపోతాయట! సూపర్ కదా... 


నాన్ చిప్ దెబ్బకి ఇక మీద ఎక్కడ నల్లధనం భారీగా దాచుకునే అవకాశమే వుండదని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు బయలుదేరాయి. కాని, ట్విస్ట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ అలాంటి మాట ఇంత వరకూ చెప్పలేదు. నానో చిప్ లాంటిదేదీ కొత్త కరెన్సీ నోట్లలో వుంటుందని ప్రకటించలేదు. ఇన్ ఫ్యాక్ట్, నానో లేదూ పాడూ లేదంటూ క్లారిఫికేషన్ ఇచ్చింది! సో... నానో చిప్ ఉట్టి గాసిప్పే!  

అసలు నానో చిప్ గురించి ఇంకాస్త లోతుగా అధ్యయనం చేస్తే మనకు తెలిసేదేంటంటే దాన్ని రెండు వేల రూపాయల నోటులో అమర్చటం ఖరీదైన వ్యవహారం. ఒక్క నానో చిప్ కరెన్సీ నోట్లో పెట్టాలంటే 50రూపాయలు అవుతుంది! అంటే లక్షల్లో నోట్లు అచ్చేయాలంటే ప్రభుత్వానికి ఆర్దిక భారం తడిసి మోపెడవుతుందన్నమాట! అంతే కాదు, దానికి పవర్ సప్లై కోసం తయారు చేసిన ప్రత్యేక జెనరేటర్ కూడా అమర్చాల్సి వుంటుంది. అప్పుడు దాన్ని నోటు వాడేవారు ముట్టుకున్నప్పుడల్లా ఒత్తిడి ఏర్పడి... శక్తి విడుదలై చిప్ పని చేసేలా చేస్తుంది. కాని, ఇదంతా చాలా టెక్నికల్ విషయం. అంత కష్టపడి వేల కోట్లు ఖర్చు చేసి ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు హై  ఎండ్ టెక్నాలజీ నోట్లు తయారు చేస్తుందా? నిస్సందేహంగా కానే కాదు!

శ్రీలంకలో హనుమంతుడి గద దొరికింది, దీపావళి రోజు ఇండియాని నాసా ఆకాశంలోంచి ఫోటో తీసింది... ఇవన్నీ ఎలాంటివో... ఈ నానో చిప్ కథ కూడా అలాంటిదే! సోషల్ మీడియాలో ఎవరో టైంపాస్ క్యాండిడేట్స్ వండి వడ్డించిన 'పులిహోర'! దట్సాల్! 

google-ad-img
    Related Sigment News
    • Loading...