Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉమెన్స్ డే గుడ్‌న్యూస్...విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు
posted on: Mar 8, 2026 1:56PM
.webp)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్(ఎక్స్) వేదికగా సీఎం ట్వీట్ పెట్టారు. కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవని అభినందించారు. సమాజాభివృద్ధికి మహిళా సాధికారత ప్రమాణంగా ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.
ప్రజాభవన్‌లో నిర్వహించిన ఉమెన్స్ డే సేలబ్రేషన్స్‌లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా మహిళలు తయారు చేసిన వస్తువులను అమెజాన్ ఈ-కామర్స్ వేదిక ద్వారా విక్రయించేలా ఆ సంస్ధతో సంప్రదింపులు జరిపినట్లు ఆయన వెల్లడించారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా మార్చుతున్నట్లు సీఎం అన్నారు. డీజిల్ బస్సులను 2026 డిసెంబర్‌లోపు జిల్లాలకు తరలిస్తామన్నారు. హైదరాబాద్‌లో వంద శాతం ఈవీ బస్సులను తెస్తున్నాం. డిసెంబర్ 9లోపు నగరంలో డీజిల్ బస్సులు ఉండవు.
నగరంలో ఏసీ ఈవీ బస్సులు తెస్తాం. కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉమెన్ జర్నలిస్టులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది. పోలీస్ సహా అవకాశం ఉన్న ప్రతి విభాగంలో మహిళ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నాం. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ తెలిపారు



.webp)


