Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పద్మశ్రీ .. ప్రమోషన్ కి మార్గమా?
posted on: Dec 24, 2013 2:46PM

ఇద్దరు లబ్దిప్రతిష్టులైన, తెలుగు సినీ పరిశ్రమలో ఉద్దండులనదగ్గ ప్రముఖుల విషయంలో సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు అటు సినిమా రంగాన్నే కాకుండా యావత్ రాష్ట్రానికి ఓ షాక్ ఇచ్చింది. నిజానికి పద్మశ్రీ పురస్కారాలను ప్రచారానికి వినియోగించుకోవడం అనేది ఒక్క సినిమారంగానికి మాత్రమే పరిమితం కాదు ... మిగిలిన రంగాలలో కూడా ఉంది.
సంస్థ బ్రోచర్ల మీద కూడా పద్మశ్రీలు ముద్రించుకుంటున్నవారున్నారు. తమ పేరుకు ముందు ఈ తరహా పురస్కారాలను రాయకపోతే మీడియా ఆఫీసులకు ఫోన్ లు చేసి మరీ తిట్టే ప్రముఖులూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తేర్పుఇ ఇలాంటి వారిలో మార్పుకు దోహదపడుతుందేమో చూడాలి.
పురస్కారం పొందిన వ్యక్తి తనకు దక్కిన గౌరవాన్ని పెంపొందించుకునేలా ప్రవర్తించాలే తప్ప దాన్ని మార్కెట్ చేసుకోవాలనుకోవడం తగదనే విషయాన్ని పురస్కారగ్రహీతలు గుర్తుంచుకోవాలి. అలాంటి జ్ఞానోదయం కలిగితే ... ఏటేటా సదరు పురస్కారాల కోసం ఎగబడే ప్రముఖుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది.



.jpg)


