ఉపప్రధానిగా చంద్రబాబు నాయుడు?

 

 

 

లోక్ సభకు సెమీఫైనల్ గా భావించే నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలొచ్చాయి. నాలుగు రాష్ట్రాలనూ కమలనాథులు దక్కించుకున్నారు. ఆ పార్టీకి కురిసిన ఓట్ల వెల్లువలో కాంగ్రెస్ అభ్యర్ధులు కొట్టుకుపోయారు. ఉత్తరాది నుంచి మధ్య భారతదేశం వరకు కాంగ్రెస్ సోదిలో లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు బిజెపి అధిష్టానం కన్ను దక్షణాది పై పడింది. ఇక్కడ తమ పార్టీ వేళ్ళూనగొనడానికి వ్యూహాలను రచిస్తుంది.

 

 

దక్షిణాదిలో వెంకయ్య నాయుడు ప్రభావం ఆశించిన ఫలిత౦ మేరకు లేకపోవడం, యాడ్యురప్ప పార్టీ పై అవినీతి మచ్చలు ఉండడం, ఎన్డీఏ భాగస్వామైన జయలలిత తమిళనాడు కే పరిమితం కావడంతో బిజెపి అధిష్టాన౦ కన్ను చంద్రబాబు నాయుడు పై పడింది. జనాల్లో మోడీ, బాబు ఫ్యాక్టర్ బలంగా పనిచేస్తుందని నరేంద్ర మోడీ వర్గం ఆలోచిస్తుంది. ఒక్కసారి విభజన జరిగాక సీమాంద్రలో కూడా రాజకీయాలు మారతాయి. అప్పుడు ఎవరు బాగా అబివృద్ది చేస్తారన్న అంశం ముందుకు వచ్చి, మోడీ, చంద్రబాబుల కాంబినేషన్ జనంలో బాగా పనిచేస్తే ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు. ఒకవేళ రాష్ట్రం సమైక్యంగానే ఉన్న పక్షంలో చంద్రబాబు, మోడీల సమర్ధత పై ప్రచారం చేసి రాజకీయంగా లబ్ది పొందాలన్నది వారి ఉద్దేశంగా ఉంది.  




గతంలో తన గుజరాత్ అభివృద్దికి చంద్రబాబు నాయుడు ఆదర్శమని నరేంద్ర మోడీ ప్రకటించారు. అంతేకాక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బిజెపి ప్రధాని అభ్యర్ది మోడీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఉప ప్రధాని అభ్యర్ధిగా చంద్రబాబు నాయుడును ప్రకటిస్తే దక్షణాదిలో బిజెపికి వున్న లోటును పుడ్చుకోవచ్చునని మోడీ వర్గం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏ కన్వీనర్ అవుదామనుకున్న తమిళ నాయుడు ముఖ్యమంత్రి జయలలిత ను కూడా ఒప్పించి చంద్రబాబు నాయుడు ను ఎన్డీఏ కన్వీనర్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు చోటు చేసుకోవడం ఖాయం.




చంద్రబాబు జాతకరీత్య కూడా 2014 లో జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తాడని జోతిష్యులు కూడా చెబుతున్నారు. మోడీ, బాబులు కలిస్తే అది టీడీపీ, బీజేపీలకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి కూడా మేలు చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతుంటే...రాష్ట్రంలో టిడిపిని నడిపించే సారధ్య బాధ్యతలు ఎవరూ తీసుకుంటారు. నారా లోకేషా, నందమూరి బాలకృష్ణా లేక ఎన్టీఆర్ మనవరాలా? అనే దానిపై కూడా రాజకీయవర్గాలలో కూడా జోరుగా విశ్లేషణలు జరుగుతున్నాయి. సాధారణ ఎన్నికల వరకు ఈ వ్యవహారం ఓ కొల్లిక్కి రావచ్చు.