వై దిస్ 371 డి?

 

 

 

వై దిస్ కొలవరి డి? పాట అప్పట్లో దేశం మొత్తాన్నీ ఓ ఊపు ఊపించింది. ప్రస్తుతం విభజనవాదులు మాత్రం వై దిస్ 371 డి? అని విషాదగీతం పాడుకుంటున్నారు. ఇటాలియన్ సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా రాష్ట్రాన్ని కేక్ మాదిరిగా కోసేయాలన్న ప్రయత్నాలకు రాజ్యాంగంలోని 371-డి అధికరణం ప్రధాన అవరోధంగా మారింది. ఈ అధికారణాన్ని సవరించడమంటే అంత సులభంగా జరిగిపోయే పనికాదు. అందుకే ఈ అధికరణం జోలికి పోకుండానే రాష్ట్రాన్ని ముక్కలు చేసేయాలని విభజనవాదులు కోరుకుంటున్నారు.

 

అయితే ఈ అధికరణ సంగతి తేల్చకుండా విభజనపై ముందుకెళ్ళే సీను లేదని రాజ్యాంగ, న్యాయ నిపుణులు తేల్చి చెప్పడంతో విభజనవాదులు తల్లడిల్లిపోతున్నారు. డిసెంబర్ 20వ తేదీ లోపు విభజనకు పార్లమెంట్‌లో ఆమోదం లభించకపోతే ఆ తర్వాత తెలంగాణ దుకాణం సర్దేయక తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో ఏం చేయాలో అర్థంకాక జుట్టుపీక్కుంటున్నారు. కొంతమంది అతివాద వేర్పాటువాదులు ఈ అధికారణాన్ని పట్టించుకోకుండా విభజన చేసేయాలని పట్టుపడుతున్నా వారి గోడు వినేవాళ్ళు ఎవరూ కనిపించడం లేదు.



విభజన తద్దినం త్వరగా పెట్టేసి తన కొడుకును గద్దె మీదకి ఎక్కించేయాలని ఉవ్విళ్ళూరుతున్న సోనియాగాంధీ కూడా ఈ 371 డి ఆర్టికల్‌ను చూసి పళ్ళు కొరుకుతున్నట్టు తెలుస్తోంది. ఈ అర్టికల్‌ని పట్టించుకోకుండా ‘పదండి ముందుకు... పదండి దూసుకు’ అని అధికార యంత్రాంగానికి ఆమె సూచించిందట. దానికి అధికార యంత్రాంగం స్పందిస్తూ, 371 డి ఆర్టికల్‌ని పట్టించుకోకుండా ముందుకు దూసుకువెళ్తే ‘పోతాం పోతాం పైపైకి’ అని సోనియాగాంధీకి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది.



ప్రస్తుతం విభజన బాధ్యతలను భుజాల మీదకి ఎత్తుకున్న వాళ్ళంతా సీమాంధ్రులకు ఎలా న్యాయం చేయాలన్న ఆలోచనలు పక్కన పెట్టేసి 371 డి అధికరణం కన్నుకప్పి రాష్ట్రాన్ని ఎలా విభజించాలన్న దానిమీదే తమ బుర్రల్ని పెట్టి ఆలోచిస్తున్నట్టు అర్థమవుతోంది. వాళ్ళు కూడా వై దిస్ 371 డి అని పాడుకుంటున్నట్టు తెలుస్తోంది.