విటమిన్ హెచ్ గురించి ఎంతమందికి తెలుసు? ఇది లోపిస్తే ఏకంగా ప్రాణాలే పోతాయి.. 

విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి12 ఇలా చాలా విటమిన్ల  పేర్లు తప్పక వినే ఉంటారు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ పోషకాహారం చాలా ముఖ్యం. కానీ విటమిన్-హెచ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?? అసలు విటమిన్ల గురించి మీకు ఎంత తెలుసు?? ఈ విటమిన్ హెచ్ లోపిస్తే జబ్బులు రావడం, శరీర పనితీరు దెబ్బతినడం కాదు, ఏకంగా ప్రాణాలే పైకి పోతాయట. ఈ విటమిన్ హెచ్ గురించి పూర్తిగా తెలుసుకుంటే..

విటమిన్ హెచ్ అంటే..
విటమిన్ B7 ని విటమిన్ H అని కూడా అంటారు. జుట్టు,  చర్మానికి ఇది చాలా ముఖ్యమైన పోషణ. బయోటిన్ ఏ విటమిన్ b7, ఈ విటమిన్ బి7 ఏ విటమిన్ హెచ్. 

ఇది లోపిస్తే..
విటమిన్ హెచ్ లేదా బయోటిన్ లోపం వల్ల బట్టతల, దద్దుర్లు, కండ్లకలక, కీటోలాక్టిక్ అసిడోసిస్, అసిడ్యూరియా, చర్మ వ్యాధులు, అలసట  ఇలా  మరెన్నో సమస్యలకు కారణమవుతుంది.

విటమిన్ హెచ్ లోపం వల్ల కొన్ని అమైనో ఆమ్లాలు సరిగా జీర్ణం కావు. దీని కారణంగా రక్తం,  మూత్రంలో ప్రమాదకరమైన పదార్థాలు పెరగడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా, మూత్రంలో నురుగు ఏర్పడటం ప్రారంభమవుతుంది.

విటమిన్ హెచ్ ఎందులో ఉంటుందంటే..
గుడ్లలో బయోటిన్ ఉంటుంది, ఇది విటమిన్ హెచ్ లోపాన్ని నివారిస్తుంది. ఒక గుడ్డు 10 mcg బయోటిన్‌ను అందిస్తుంది. ఇది రోజువారీ అవసరాలలో భారీ భాగం.

శాకాహారులు విటమిన్ హెచ్‌ని పొందడానికి బాదంపప్పును తినవచ్చు. పావు కప్పు బాదంపప్పు తినడం వల్ల 1.5 mcg బయోటిన్ లభిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, చిలగడదుంపలు, బ్రోకలీ, బచ్చలికూర, సాల్మన్ చేపలు, పాలు, అరటిపండ్లు మొదలైన వాటిని తినడం ద్వారా కూడా విటమిన్ హెచ్ లేదా బయోటిన్ పొందవచ్చు .

*నిశ్శబ్ద.