ఈ ఐదు పండ్ల రసాలు షుగర్ ఉన్నవారికి పంచదార కంటే డేంజర్..!
posted on Feb 8, 2024 @ 10:28AM
డయాబెటిస్‌ను నియంత్రించడానికి చక్కెరను పూర్తిగా తగ్గించాలి. పండ్లలో సహజ చక్కెర కూడా ఉంటుంది, ఇది మధుమేహం రావడానికి చాలా కారణం అవుతుంది. కొన్ని పండ్లలో ఇవి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి తక్కువ సమయంలో బ్లడ్ షుగర్ ను రాకెట్ వేగంలో పెంచగలవు. నిజానికి డయాబెటిక్ డైట్‌లో సమతుల పరిమాణంలో పండ్లు తినడం ఆరోగ్యకం. కానీ పండ్ల రసంలో ఫైబర్, ఇతర విటమిన్ల పరిమాణం తగ్గిపోతుంది ఎక్కువగా చక్కెర మిగిలి ఉంటుంది. అందువల్ల వీటిని తాగడం వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండ్ల రసాన్ని అస్సలు తాగకూడదు. అవేంటో తెలుసుకుంటే..
ఆపిల్ పండు రసం
యాపిల్ ఒక సూపర్ హెల్తీ ఫ్రూట్ అయితే దాని రసం చక్కెరలో కూడా అంతే ప్రమాదకరం. ఈ పండులో సహజ చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహాన్ని మరింత తీవ్రతరం చేసే పిండి పదార్థాలను కూడా అందిస్తుంది. అందుకే యాపిల్ రసాన్ని తీసుకోవడం ప్రమాదం.
మామిడికాయ రసం
మామిడి పండ్లలో రారాజు అయితే రక్తంలో చక్కెర శాతం పెంచడంలో మామిడిపండ్ల రసం శత్రువులా పనిచేస్తుంది. దీన్ని తాగిన తర్వాత మధుమేహ రోగులు అధిక దాహం, నోరు పొడిబారడం, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
నారింజ రసం
నారింజ అధిక విటమిన్ సి కలిగిన పండు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని తింటే అనారోగ్య సమస్యల నుండి సులువుగా బయటపడతారు. కానీ డయాబెటిక్ పేషెంట్లు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి.
పైనాపిల్ రసం
ఒక కప్పు పైనాపిల్ ముక్కలను తీసుకుంటే అందులోని పిండి పదార్థాలు దాదాపు 16 గ్రాములుగా ఉంటాయి. ఇవి రక్తంలో వేగంగా కరిగి గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి. ఇది హైపర్గ్లైసీమియాకు దారి తీస్తుంది, రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వస్తుంది.
పుచ్చకాయ రసం
పుచ్చకాయ తినడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండి ఎనర్జీని మెయింటెయిన్ చేస్తుంది. కానీ మధుమేహం, ప్రీ-డయాబెటిస్‌లో దీనిని తీసుకోవడం రిస్క్ తో కూడుకున్నది భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినవచ్చు.
*నిశ్శబ్ద.