Read more!

సహజంగా శరీరంలో విషపదార్థాలను తొలగించుకోవడానికి అద్బుతమైన ఆహారాలు..

ప్రతి రోజూ స్నానం చేస్తాం, శరీరం  ఆరోగ్యంగా కనిపించేలా చూసుకుంటాం. దుస్తుల దగ్గర నుండి శరీరం మీద ఎక్కడైనా మురికి పేరుకుందా లేదా అని గమనించి జాగ్రత్తలు తీసుకుంటాం. ఇలా బాహ్య శుభ్రతకు ఇచ్చిన ప్రాముఖ్యత, దాని మదీ తీసుకున్న శ్రద్ద అంతర్గత శుభ్రత గురించి చాలామందికి ఉండదు. కానీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అంతర్గత శుభ్రతే ముఖ్యం. ఇప్పుడున్న ఆహార కాలుష్యం, జీవనశైలి, వాతావారణ మార్పులు ఇలా ప్రతి ఒక్కటి శరీర అంతర్గత ఆరోగ్యాన్ని ప్రభావం  చేస్తుంది. కొన్ని అద్బుతమైన ఆహారాలు తీసుకోవడం వల్ల లోపలి శరీరం శుద్ది అవుతుంది. టాక్సిన్ లు తొలగిపోతాయి. అవేంటో తెలుసుకుంటే..

బీట్‌రూట్‌లో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.   ఆరోగ్యానికి చాలా  మేలు చేస్తాయి. ఇది కాలేయానికి కూడా చాలా మంచిది.  ఇది నేచురల్ బ్లడ్ క్లెన్సర్‌గా  పనిచేస్తుంది. ఇందులో నైట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది రక్తంలోని విషాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ బీట్రూట్ జ్యూస్ తాగినా లేదా రోజులో కనీసం కొన్ని బీట్ రూట్ ముక్కలు తిన్నా రక్తాన్ని శుద్ది చేస్తుంది. కేవలం రెండు వారాల నుండి నెలలోపే ఇందులో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల చాలా ఏళ్లుగా దీనిని ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే కర్కుమిన్ కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి శరరీరాన్ని  రక్షిస్తుంది. అందువల్ల, ఆహారంలో పసుపును చేర్చుకోవచ్చు, గోల్డ్ మిల్క్ పేరుతో పిలుచుకునే పసుపు పాలు తాగడం లేదా వేడి నీటిలో చిటికెడు పసుపు వేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది గొప్ప రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది.  జీర్ణక్రియకు  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీన్ని నీటిలో కలిపి కూడా తాగవచ్చు. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది.

కొత్తిమీర  ఆహారానికి రుచిని, సువాసనను ఇవ్వడానికి మాత్రమే కాదు, శరీరంలో  కొలెస్ట్రాల్ నియంత్రించడంలోనూ,  జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ  ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో పాటు, ఇది  శరీరంలో ఉండే ఎక్కువ మొత్తం టాక్సిన్ లను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, దీన్ని తినడం వల్ల  శరీరం డిటాక్సిఫై అవుతుంది.

వెల్లుల్లిలో అధిక సల్ఫర్ కంటెంట్ ఉంటుంది.  ఇది టాక్సిన్స్ తొలగించడంలో కాలేయానికి సహాయపడుతుంది. దీనితో పాటు జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ఆహారంలో వెల్లుల్లిని చేర్చడం ద్వారా  శరీరాన్ని డిటాక్స్ చేయవచ్చు.