Read more!

వీధి కుక్కా మజాకానా ..పోలీసాయ‌న్ని కాపాడింది!

ఒక పోలీసాయ‌న‌.. రాత్రి కాస్తంత పొద్దు బోయాక ఇల్లు చేరాడు. టోపీ తీసి టేబుల్ మీద ప‌డేసి  అలానే మంచం మీద ప‌డుకున్నాడు. చాలాసేప‌టికి ఇంట్లో వారు లేపితే కాస్తంత తిని  ప‌డుకు న్నాడు. అంత‌లో పేద్ధ శ‌బ్దం. బ‌య‌ట‌పెట్టిన టూవీల‌ర్ పేలిపోయింది. ప‌రుగున పోలీసాయ‌న బ‌య‌టికి వ‌చ్చేడు. బండి కాలి బొగ్గ‌యింది. త‌న‌కు తెలిసిన వెధ‌వ‌ల్ని త‌ల‌చుకున్నాడాయ‌న‌. . ఇది చాలా స‌హ‌జంగా మ‌నం చూసే సిని మాలో సీన్‌. స‌రే ఆన‌క ఆయ‌నే బెల్టు స‌ర్దుకుని వెంటాడి వాడేవ‌డినో ప‌ట్టేసుకుంటాడు. కానీ  ఈమ‌ధ్య అమృత్‌స‌ర్‌లో దాదాపు ఇదే సీన్ కానీ ఇంతగా ఏమీ జ‌ర‌గ‌లేదు. కార‌ణం ఓ కుక్క‌!

అమృత్‌స‌ర్ ఎస్ ఐ దిల్బాగ్ సింగ్‌. మొన్నామ‌ధ్య అర్ధ‌రాత్రి ఇల్లు చేరాడు. స‌బ్ ఖుష‌ల్ మంగ‌ళ్ హై అన్న న‌మ్మ‌కంతో ఇంట్లో వారితో స‌ర‌దాగా క‌బుర్లు చెప్పి ప‌డుకున్నాడు. పోలీసాయ‌న ఇంట్లోకి వెళితే బ‌య‌టికి రాడ‌న్న ధీమాతో ఇద్ద‌రు దొంగ‌స‌చ్చినోళ్లు చాలా సినిమాటిక్‌గా చీక‌ట్లో న‌క్కి న‌క్కి వ‌చ్చి జీపు చ‌క్రాల మ‌ధ్య బాంబు పెట్టి మ‌రీ జారుకున్నారు. ఇంకేముంది తెల్లారితే ఆయ‌న మ‌ర‌ణ‌వార్త చ‌క్క‌గా విన‌వొచ్చు, ప‌త్రిక‌ల్లో చూడొచ్చ‌నే అనుకున్నారు. కానీ అలా ఏమియూ జ‌ర‌గ‌లేదు. బాంబులు పెట్టిన‌వాళ్లు చేతులు చూసుకునే ఉంటారు.. ఇదే చేత్తోనే బాంబు అమ‌ర్చాం గ‌దా బావా! అని అనుకునే ఉంటారు. 

వాళ్లు బాంబు అమ‌ర్చారు. కానీ అటుగా తీరిగ్గా వెళుతోన్న ఓ వీధి కుక్క వీరి  వేషాలు గ‌మ‌నించింది. వాళ్లు వెళ్ల‌డం చూసి అది కూడా అంతే భ‌యం భ‌యంగా జీపు దగ్గ‌రికి వెళ్లింది. అసలే ఆక‌లితో ఉందేమో, బాంబు ని చూసి ఏ పండో కాయో అనుకుని అమాంతం పీకి అవ‌త‌ల ప‌డేసింది. తిన్న‌దో, అది ఏమ‌యిం దో తెలియ‌లేదు. కానీ ఎస్‌.ఐ మ‌రి కొన్నాళ్లు బ‌త‌క‌డానికి మాత్రం నూక‌లు మిగిల్చింది. పోలీసాయ‌న గ‌తంలో ఏదో ఒక‌రోజు ఏ జంక్ష‌న్‌లోనో దానికి ఏ అర‌టిపండో, ఏదో పెట్టే ఉంటాడు.  అది ఇప్ప‌టికి ఫ‌లితా న్నిచ్చింది. ఇక్క‌డే దేముడున్నాడ్రా మావా ఆడే సూసుకుంటాడంతా.. అన్న సింగు గారి ప‌క్కింటాయ‌న మాటా క‌రెక్టే!