పరకామణి చోరీపై జగన్ కామెంట్స్...ముప్పేట దాడి షురూ
posted on Dec 5, 2025 @ 9:25PM
పరకామణి చోరీపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తిరుమల పరకామణి చోరీని..చిన్న చోరీ అనడం చర్చనీయాంశమయ్యాయి. జగన్ వ్యాఖ్యలు దొంగలను సమర్థిస్తున్నాయంటూ కూటమి పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తిరుమల పరకామణి చోరీ కేసుపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకుతిరుమల పరకామణి చోరీ కేసుపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
తిరుమల పరకామణి చోరీని చిన్న చోరీ అన్న జగన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయట. పరమ పవిత్రమైన శ్రీవారి ఆలయంలో దొంగతనం జరిగిందని చెబుతూనే...దేశంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుంటాయని...అలానే తిరుమలలో జరిగిందనే విధంగా జగన్ మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కలియుగ దైవంగా కొలిచే తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీని.... చిన్న చోరీగా జగన్ అభివర్ణించడం రాజకీయ నేతలు, శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
పరకామణి చోరీ కేసు రాజీపై కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. వైసీపీ హయాంలో చోరీ జరగగా...నిందితుడితో టీటీడీ పెద్దలు రాజీ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ వివాదం సర్దుమణిగింది. కానీ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పరకామణి కేసు రాజీ చేసుకోవడాన్ని తప్పుబడుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
రాజీ కుదర్చుకోవడం చట్ట బద్దం కాదని, నిబంధలకు విరుద్ధంగా నడుచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ విషయంపై హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చోరీ కేసును రాజీ చేసుకోవడం తప్పంటూ వ్యాఖ్యానించడమే కాకుండా, సీఐడీ విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది.
ఓవైపు సీఐడీ విచారణ జరుగుతున్న క్రమం...మరోవైపు హైకోర్టులో విచారణ దశలో ఉన్న కేసుపై జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదో చిన్న కేసు అంటూ కేవలం 9 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తుండగా... తమ హయాంలోనే పట్టుకున్నామని...చోరీని తేలిగ్గా చూపే ప్రయత్నం చేయడంపై భక్తులు,సోషల్ మీడియాలో దుమెత్తిపోస్తున్నారు. అంతేకాకుండా 72 వేల రూపాయల విలువైన డబ్బు చోరీ జరిగితే...దొంగ ప్రాయశ్చిత్తంగా 14 కోట్లు విలువైన ఆస్తులను స్వామి వారికి రాసిచ్చారని జగన్ చెప్పడాన్ని భక్తులు తప్పుబడుతున్నారట. 72 వేలు విలువైన డాలర్లను దొంగతనం చేసిన వాడు 14 కోట్ల ఆస్తులను తిరిగి ఇచ్చాడంటే అతడికి అంత ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంపై విచారణ జరపాలి కదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయట.
చోరీని తక్కువ చేసి చూపడం దొంగలను సమర్థించడమే అవుతుందని భక్తులు మండిపడుతున్నారట. పరమ పవిత్రంగా భావించి శ్రీవారికి సమర్పించుకున్న మొక్కులు, కానుకలు చోరీకి గురైతే చిన్న చోరీ అంటూ దొంగలకు వత్తాసు పలుకుతూ మరో మహా పాపానికి ఒడిగడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయట.వాయిస్-జగన్ చేసిన కామెంట్స్‌పై రాజకీయంగానూ విమర్శల వేడి పెరిగింది. దేవదేవుని పరకామణిలో దొంగతనం చేస్తే అదేదో చిన్న దొంగతనమే కదా అని వ్యంగ్యంగా మాట్లాడం చూస్తుంటే బాధకలుగుతుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దేవుడి దగ్గర దొంగతనం చేస్తే చిన్న దోంగ తనం అంటూ మాట్లాడిన జగన్ సంగతి దేవుడే చూసుకుంటాడని లోకేష్ అన్నారు. పరకామణి చోరీని చిన్న తప్పు అనడంపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలియువ వెంకటేశ్వరుడి ఆలయంలో చోరీ చేయడమే మహాపాపం అని అన్నారు. వెంకన్న ఖజానాలో చోరి జరిగితే చిన్న చోరీ అంటావా...బుద్దుందా జగన్ అంటూ బీజేపీ నేతలు ఘాటుగానే విమర్శించారు. 72వేల చోరీ చేసిన వ్యక్తికి 14 కోట్లు ఎలా వచ్చాయో తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతలు జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తుంటే...వైసీపీ నేతలు మాత్రం సమర్ధించే విధంగా మాట్లాడుతుండటం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది. దొంగ ఇచ్చిన 14 కోట్ల రూపాయలను టీటీడీ మాజీ ఛైరెమన్ భూమన కరుణాకర్ రెడ్డి దానంగా చెప్పుకురావడం మరింత సంచలనంగా మారింది.
టీడీడీకి ఎవరు దానం ఇచ్చినా...దానంగానే పరిగణిస్తారని చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది. దొంగ ఇచ్చారా...మరొకరిచ్చారా అనేది కాదని...ఎవరిచ్చినా తీసుకునే పరిస్ధితి టీటీడీలో ఉందంటూ భూమన కరుణా రెడ్డి మరో వివాదానికి తెరలేపారు జగన్ వ్యాఖ్యలతో మరోసారి రాజకీయానికి కేంద్రబిందువుగా తిరుమల పరకామణి ఇష్యూ మారింది. జగన్ వ్యాఖ్యలు దొంగను సమర్థించే విధంగా ఉన్నాయంటూ కూటమి పార్టీలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే...వైసీపీ నేతలు మాత్రం..జగన్‌ను వెనకేసుకొస్తుండటం..అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోందట.