ముంచుకొస్తున్న మరో ప్యాండమిక్...
posted on Nov 17, 2021 @ 9:30AM
ప్రపంచం నేడు మరో ప్యాండమిక్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సి డి సి పిలుపు నిచ్చింది. ప్రపంచంలో నేడు కోవిడ్ ప్యాండ మిక్ తరువాత తట్టు మీజిల్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రపంచం లోని 22 మిలియన్ల శిశువులు తట్టు భారిన పడే అవకాశం ఉందని సి డి సి హెచ్చరించింది. ఎవరైనా శిశువులు ముఖ్యంగా ప్యాండ మిక్ తరువాత వ్యాక్సిన్ వేసుకొని మీజిల్స్ తట్టు బాకి తీసుకునే ప్రామాదం ఉందని తెలుస్తోంది.పోలియో ప్రమాదాన్ని ఎదుర్కునేందుకు ఎలా సన్నద మయ్యమో అలాగే సన్నద్ధం కావాలని.పెద్ద ఇన్ఫెక్షన్ తో కూడుకున్న సమస్య ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ యు ఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్,కంట్రోల్ సంస్థ ప్రకటించింది.
2౦19 -2౦2౦ సంవత్సరం లో తట్టును ఎదుర్కునెందుకు కేవలం 3 మిలియన్ల శిశువులు మాత్రమే వ్యాక్సిన్లు తీసుకున్నారని అంటే దాదాపు 7౦%మాత్రమే రెండు డోసులు తీసుకున్నారని.ఇంకా 95% మిగిలే ఉందని శిశువులను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనపై ఉందని.నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే మీజిల్స్ తట్టు వ్యాధిని ఎదుర్కోడానికి ప్రణాలికలను సిద్ధం చేసామని.పిల్లల బాల్యాన్ని చిదిమేసే తట్టు ను సమర్ధవంతంగా ఎదుకునేందుకు 23 దేశాల లో అమలు కు ప్రానాలిక సిద్ధం చేసినట్లు అలాగే సరైన సమయంలో శిశువులకు చికిత్స చేయకుంటే మరణానికి దారి తీస్తుందని హెచ్చరించారు. తట్టు నివారణ నిర్మూలనకు కార్యాచరణ అమలు చేయాల్సి ఉండగా ప్యాండమిక్ వల్ల వ్యాక్సినేషన్ వాయిదా వేయాల్సి వచ్చిందని.93 మిలియన్ల శిశువులు తట్టు భారిన పడే అవకాసం ఉందని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది.
ఆరోగ్య సంస్థల సమాచారం ప్రకారం....
పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ వేసుకొని శిశువులు తట్టు తీవ్రంగా మారే అవకాశం ఉందని.తట్టు వ్యాధిని గుర్తించడం.నిర్ధారణ, విషయం లో స్పందించలేక పోవడానికి కారణం కోవిడ్ 19 గా పేర్కొన్నారు.
తట్టు లేదా మీజిల్స్ వల్ల మరణాలు....
శిశువుల లో తట్టు తీవ్రంగా మారి మరణించే అవకాసం ఉందని సి డి సి గ్లోబల్ ఇమ్యునైజేషన్ డైరెక్టర్ కెవిన్ కైన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.మనం తట్టు పై దృష్టి సారించాలని నిశితంగా పరిసీలించాలని వివిధ వర్గాలలో ప్రయాణానికి ముందు ప్యాండమిక్ ముందు తట్టు మీజిల్స్ పెరిగే అవకాసం ఉండని హెచ్చరించారు. మనం తట్టు పై పట్టు సాధించాలంటే వ్యాక్సిన్ తోనే నియంత్రించగలమని పేర్కొన్నారు కాగా 2౦2౦ నాటికి కాస్త తట్టు తగ్గిందని తూఫానుకు ముందు నిశ్శబ్దం లాగా ప్రామాడం పొంచి ఉందని అది ప్రపంచంలో విస్తరించే అవకాసం ఉందని. డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ కాటే ఓబ్రేయిన్ ఇమ్మ్యునైజేషణ్ విభాగం పేర్కొంది.
ప్రపంచం మొత్తం తట్టు వైరస్ విస్తరించక ముందే వ్యాక్సినేషన్ కు సిద్ధం కావాలని సరైన సమయంలో వ్యాక్సిన్ అందక పోవడం వల్ల గత 2౦ సంవత్సరాలుగా 3౦ మిలియన్ల శిశువులు మరణిచారు.2౦ 2౦ సంవత్సరం లో 6౦75 మిలియన్ల శిశువులు మిలియన్ల ప్రజలు వ్యాధిబారిన పడే అవకాసం ఉందని కాగా ఇప్పటికే మరణాలు చోటు చేసుకోవడం విచారకరమని ఆరోగ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేసారు.