సింపుల్‌గా బరువు తగ్గాలంటే...
posted on Apr 27, 2024 @ 9:30AM
అందరినీ వేదించే సమస్య ముఖ్యంగా యువతను వేదిస్తున్న సమస్య ఊబ కాయం అంటే ఒబెసిటీ. దీనికోసం తిరగని చోటంటూ ఉండదు .
వెళ్ళని డాక్టర్ అంటూ లేదు. సక్షన్లు, నాన్ లైపోసక్షన్లు. ప్రత్యేకంగా దీనికోసమే ఉన్న ఆసుపత్రులు. ప్రత్యేక సర్జన్లు. ఇలా ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావడం గమనించ వచ్చు.చేతి వాడిని ఒదిలి కాలివాడిని పట్టుకున్నట్లు మనం పాటించాల్సిన కనీస నియమావళిని అమలు చేయకుండా స్వీయ నియంత్రణ లేకుండా ఊబ కాయాన్ని తగ్గించలేమని అంటున్నారు వైద్యులు.మీ శరీరం బరువు తగ్గాలంటే రాత్రి వేళ ఈ పది సూత్రాలు అమలు చేయండి.మీరు మీ శరీర బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు.ప్రతిరోజూ వర్క్ అవుట్ తప్పని సరిగా చేస్తూ ఉంటారు. కొన్ని మార్పులు చేసి ప్రయత్నం చేయండి. దీని వల్ల మీరు నాజూకుగా స్లిమ్ముగా కనపడడానికి దోహదం చేస్తాయి.
రాత్రి సమయమే సరైన సమయం...
మన శరీర బరువు తగ్గించే ప్రయత్నం చేస్తు ఆరోగ్యకర మైన ఆహారం తీసుకుంటూనే వర్క్ అవుట్ చేస్తూ ప్రతిరోజూ ప్రత్యేకమైన విషయాలు అనుసరించాలి.అందులోను కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ రాత్రివేళ ప్రయత్నించండి మీరు స్లిమ్ గా మారచ్చు .సాయంత్రం వేళ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచండి. సాయంత్రం వేళ మిమ్మల్నిమీరు ఒక వ్యాపకం వైపుకు మళ్లించండి. కొన్ని సందర్భాలలో ప్రజలు చాలా ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. అలా చెయడం బోరింగ్ మీరు ఫిట్ గా ఉండాలంటే నిద్ర పోయే ముందు కొంత పని చేయాల్సి ఉంటుంది. కొంచం సేపు నడవడం, చాట్ చేయడం, వ్యాసాలు రాయడం, మీమిత్రులతో పంచుకోవడం. లేదా కొన్ని పుస్తకాలు చదవడం వల్లమీరు ఆహారం పెద్దగా తీసుకోరు. ఒక కొత్త అలవాటు ఒక్కొఅంశం పైన ఆశక్తి పెంచుకోడం వల్ల పెయింటింగ్ వేయడం. సంగీతం పాడడం లేదా ఏదైనా వాయిద్యం వాయించడం. అల్లికలు చేయడం వంటి పనుల వల్ల ఆహారం తినాలన్న కోరిక తగ్గిపోతుంది. మళ్ళీ తినా లన్నా కాంక్ష బోర్ గా ఉంటుంది.
సరిగా నిద్రపోవాలి...
సాయంత్రం వేళలో కాస్త వ్యాయామం కొంత మేర మీకు సహాయ పడుతుంది. అది ఎక్కువ సేపు వ్యాయామం చేయకూడదు. విరామం లేకుండా చేసే వ్యాయామం చెయడం వల్ల నిద్ర పోవడం కొంచం కష్టంగా ఉంటుంది. మరీ ఆలస్యంగా వర్క్ అవుట్ చేయకండి. నిద్రపోడానికి రాత్రివేళ గంట ముందు వ్యాయామం ఆపేయండి ఆతరువాతే నిద్రకు ఉపక్రమించండి.
నిద్రపోయే ముందు తినకండి...
నిద్రపోయే ముందు మీరు డిన్నర్ తీసుకుంటారా? అల్పాహారం అంటే టిఫిన్ తీసుకుంటారా? ఏదైనా మీరు మీఅహారాని నిద్రకు ముందే ముగించేయ్యాలి. అలాకాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీఆహారం తీసుకుంటే అది మీ శరీర బరువును మరింత పెంచుతుంది. అయితే మీరు మీ బరువు తగ్గాలన్న ప్రయత్నం విఫలం కావచ్చు. సరైన సమయం, అంటే ఏ సమయంలో ఆహారం తిన్నారు అన్నది విషయం కాదు. చాలా మంది రాత్రి వేళలో ఆహారం తీసుకునే వాళ్ళు పైగా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటారు. అర్ధ రాత్రి భోజనం ,అల్పాహారం తీసుకోడం వల్ల నిద్రపోలేరు. దీనివల్ల మళ్ళీ బరువు పెరుగుతారు. కొన్ని గంటల పాటు వంట గది నుంచి బయటికి రండి. నిద్రపోయేముందు నుంచి మరుసటి రోజు ముందు వరకు మేల్కుని ఉంటారు.
మీ మధ్యాహ్న భోజనాన్ని రేపటికి ప్యాక్ చెయ్యండి...
ప్రతి రోజూ మీరు మాధ్యాహ్న భోజనానికి బయటికి వెళ్తున్నారా? అయితే కొంత పొడుపు చేయండి.
రాత్రికి ముందే మీ లంచ్ ను ప్యాక్ చెయ్యండి. బయట తినడము అంటే అందులో ఎక్కువ కొవ్వు పదార్ధాలు, సోడియం ఉంటుంది మీ ఆహారాన్ని మీరే ప్యాక్ చేసినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఇచ్చే బాదాం, టర్కీస్లై సెస్, హోల్ గ్రైన్, తక్కువ కొవ్వు ఇచ్చే
పాల ఉత్పత్తులు చాలా రకాల పండ్లు ఫలాలు తీసుకోవచ్చు.
మీరు మీ సమయ పాలనకు కట్టుబడి ఉండండి...
రాత్రి వేళ మీరు ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారని గమనిస్తే అంటే దాని ఆర్ధం ఉదయం వేళ మీరు సరిపడే ఆహారాన్ని తీసుకోలేదని అర్ధం. దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్నకు సమాధానంగా మీ భోజనం మీరు ప్రతిరోజూ తీసుకోవాలి. ఆరకంగా మీ శరీరానికి ఎప్పుడు ఆహారం తీసుకోవాలో తెలుస్తుంది. మాధ్యాహ్న భోజనం రాత్రి డిన్నర్ మధ్య స్నాక్ తీసుకుంటే మంచిది. అలా ప్రయత్నం చేయడం అది మీరు ఎక్కువగా చేయకండి.
టి వి ని కట్టెయ్యండి...
రాత్రి వేళ ఆహారం తీసుకుంటూ టివి చూసే అల వాటు మీకు ఉంటె మీరు ఆహారం తీసుకునే సమయం టి వి చూసే సమయం ఆమధ్యలో మీరు ఎక్కువ ఆహారం తీసుకునే అవకాసం ఉంది.రాత్రి ఆహారం తీసుకున్నాక మీ చిగుళ్ళను పళ్ళను బ్రష్ చేయండి. రాత్రి వేళ మీరు తీసుకునే ఆహారాన్నిపూర్తిగా తగ్గించాలంటే మీరు మీపళ్ళను చిగుళ్ళను శుబ్రం చేసుకోండి. ఒక వేళ మీ పళ్ళు శుభ్రంగా ఉంటె నిద్రపోవడానికి ముందే అల్పాహారం తీసుకునే ముందు రెండు సార్లు ఆలోచించండి.
పళ్ళు శుభ్రం చేయడానికి 6౦ నిమిషాలు ఆలోచించండి. ప్రత్యేకంగా మీరు యాసిడ్స్ లాంటివి అంటే నిమ్మరసం, ద్రాక్ష పళ్ళు, సోడా లాంటివి తీసుకుంటే 6౦ నిమిషాలు ఆగాలి అంటున్నారు నిపుణులు.
ఒత్తిడిని సులభంగా జయించవచ్చు...
మీరు ఒత్తిడిని ఎదుర్కుంటూ న్నట్లైతే మీ బరువు పెరిగే అవకాశం ఉంది. రాత్రి వేళ కాసేపు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. లోపలి సుదీర్ఘ శ్వాస తీసుకునే పద్దతులు అవలంబించండి. లేదా మెడిటేషన్ ధ్యానం చెయడం ద్వారా ఒత్తిడిని జయించ వచ్చని అలా చేయడం వల్ల నాణ్యతతో కూడుకున్న నిద్ర ను పొందవచ్చు.
ఇక చివరగా రాత్రివేళ నిద్ర పోయే ముందు లైట్లు తీసి వేయండి..
చీకాట్లో నిద్రపోవడం చాలా మందికి అల వాటు. అలా చేయడం వల్ల మాంచి నిద్ర పడుతుంది.మీరు బరువు తగ్గించు కోవాలన్న ప్రయత్నాం చేయడం ద్వారా మీ కిటికీలు మూసి వేయండి. కర్టెన్లు వేసుకోండి. ఫోన్లు ల్యాబ్ టాబ్ కు దూరంగా ఉండండి. పడు కునేందుకు ముందు 3౦ నిమిషాలు వాటికి దూరంగా ఉండండి. కంటి మీద మాస్క్ వేసుకుంటే సహాయ పడుతుంది.