జనసేన మేనిఫెస్టో విడుదల

posted on: Apr 3, 2019 11:49AM

 

జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.  ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదాలతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు.  ప్రజాసంక్షేమం, సంపద పంపిణీలో సమాన అవకాశాలు, నిరుద్యోగ సమస్య నిర్మూలన, రైతులు, మత్స్యకారుల రక్షణ కోసం చట్టాలు, పేదరికం నిర్మూలన వంటి ప్రధాన అంశాలు కలిగిన ఈ మేనిఫెస్టోలో ఇంకా చాలా హామీలున్నాయి. రాయల సీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా ప్రాంతాల వారీగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను పేర్కొంది.

60 ఏళ్ళు పైబడిన రైతులకు, 58 ఏళ్ళు దాటినా మత్స్యకారులు, చేతి వృత్తులవారికి నెలకు 5000 పెన్షన్, రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి, పీజీ వరకు ఉచిత విద్య, ఇంటర్ విద్యార్థులకు ల్యాప్ టాప్స్ ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని జనసేన హామీ ఇచ్చింది. ఆడపిల్ల పెళ్ళికి లక్ష వరకు వడ్డీ లేని రుణం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, గృహిణులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500 నుంచి రూ.3500 వరకు నగదు జమ వంటి సంక్షేమ పథకాలను ప్రకటించింది. పవన్‌ ఇంతకుముందే ప్రకటించినట్లుగా ఉద్యోగుల సీపీఎస్‌ రద్దు వంటి తదితర అంశాలను మేనిపెస్టోలో చేర్చారు. మొత్తం 96 హామీలను జనసేన పొందుపరిచింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...