జగన్ ద్వేషం.. అమరావతికి వరం!!

అమరావతి నెత్తిన జగన్ పాలు పోశారంటున్నారు పరిశీలకులు. అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. సరే రాష్ట్ర ప్రజలంతా అమరావతి వెంనే ఉన్నారన్న సంగతి 2024 ఎన్నికల ఫలితం తేల్చేసింది. అధికార పగ్గాలు చేపట్టినత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అమరావతి పురోగతి పనులను వాయువేగంతో చేపట్టింది. జగన్ కాలంలో జంగిల్ గా కనిపించిన అమరావతి ఇప్పుడు ఆకాశ హర్మ్యాలతో, నిరాటంకంగా సాగుతున్న నిర్మాణ పనులతో కలకలలాడు తోంది. అయినా అందరిలో ఓ చిన్న అనుమానం. ఐదేళ్ల తరువాత అంటే 2029 ఎన్నికలలో ఏదైనా అనూహ్యం సంభవించి జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇదే సంశయం అమరావతి రాజధాని రైతులనూ తొలిచేసింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు.

ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా  అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం కూడా కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం కూడా  అందుకు సై అంది.  అమరావతికి రక్షణగా నిలవడానికి ముందుకు వచ్చింది.దీంతో ఆంధ్రప్రదేశ్ శాశ్వత, ఏకైక  రాజధానిగా అమరావతి అని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు చట్టబద్ధత కల్పించడానికి సై అంది. 

ఇక ఆ దిశగా చర్యలు తీసుకోవడం లాంఛనమే అన్నది రూఢీ అయిపోయింది. దేశం మొత్తంలోనే ఏ రాష్ట్ర రాజధానికీ ఇలా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలేదు. చటబద్ధత కల్పించిన పరిస్థితీ లేదు. ఒక్క అమరావతికి మాత్రమే ఆ భాగ్యం దక్కింది. ఇందుకు ఎవరు ఔనన్నా కాదన్నీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే కారణం. ఆయన ఇసుమంతైనా దాచని అమరావతి ద్వేషం కారణంగానే సపోజ్ ఫర్ సపోజ్ ఆయన భవిష్యత్ లో పొరపాటున అధికారంలోకి వచ్చినా అమరావతిలో ఒక్క ఇటుక ముక్క కూడా కదిలించే అవకాశం లేకుండా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత రాబోతోంది.  దేశంలో ఏ రాజధానికీ దక్కని ఈ భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దక్కడానికి జగన్ ద్వేష పూరిత, కక్ష సాధింపు రాజకీయ వైఖరే కారణమనడంలో సందేహం లేదు. 

పరకామణి చోరీపై జగన్ కామెంట్స్...ముప్పేట దాడి షురూ

  పరకామణి చోరీపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.  తిరుమల పరకామణి చోరీని..చిన్న చోరీ అనడం చర్చనీయాంశమయ్యాయి. జగన్ వ్యాఖ్యలు దొంగలను సమర్థిస్తున్నాయంటూ కూటమి పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తిరుమల పరకామణి చోరీ కేసుపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకుతిరుమల పరకామణి చోరీ కేసుపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.  తిరుమల పరకామణి చోరీని చిన్న చోరీ అన్న జగన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయట. పరమ పవిత్రమైన శ్రీవారి ఆలయంలో దొంగతనం జరిగిందని చెబుతూనే...దేశంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుంటాయని...అలానే తిరుమలలో జరిగిందనే విధంగా జగన్‌ మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కలియుగ దైవంగా కొలిచే తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీని.... చిన్న చోరీగా జగన్ అభివర్ణించడం రాజకీయ నేతలు, శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.    పరకామణి చోరీ కేసు రాజీపై కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. వైసీపీ హయాంలో చోరీ జరగగా...నిందితుడితో టీటీడీ పెద్దలు రాజీ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ వివాదం సర్దుమణిగింది. కానీ  కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పరకామణి కేసు రాజీ చేసుకోవడాన్ని తప్పుబడుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.  రాజీ కుదర్చుకోవడం చట్ట బద్దం కాదని, నిబంధలకు విరుద్ధంగా నడుచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.  ఈ విషయంపై హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చోరీ కేసును రాజీ చేసుకోవడం తప్పంటూ వ్యాఖ్యానించడమే కాకుండా, సీఐడీ విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది.  ఓవైపు సీఐడీ విచారణ జరుగుతున్న క్రమం...మరోవైపు హైకోర్టులో విచారణ దశలో ఉన్న కేసుపై జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదో చిన్న కేసు అంటూ కేవలం  9 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తుండగా... తమ హయాంలోనే పట్టుకున్నామని...చోరీని తేలిగ్గా చూపే ప్రయత్నం చేయడంపై భక్తులు,సోషల్ మీడియాలో దుమెత్తిపోస్తున్నారు.  అంతేకాకుండా 72 వేల రూపాయల విలువైన డబ్బు చోరీ జరిగితే...దొంగ ప్రాయశ్చిత్తంగా 14 కోట్లు విలువైన ఆస్తులను స్వామి వారికి రాసిచ్చారని జగన్ చెప్పడాన్ని భక్తులు తప్పుబడుతున్నారట.  72 వేలు విలువైన డాలర్లను దొంగతనం చేసిన వాడు 14 కోట్ల ఆస్తులను తిరిగి ఇచ్చాడంటే అతడికి అంత ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంపై విచారణ జరపాలి కదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయట.  చోరీని తక్కువ చేసి చూపడం దొంగలను సమర్థించడమే అవుతుందని భక్తులు మండిపడుతున్నారట. పరమ పవిత్రంగా భావించి శ్రీవారికి సమర్పించుకున్న మొక్కులు, కానుకలు చోరీకి గురైతే చిన్న చోరీ అంటూ దొంగలకు వత్తాసు పలుకుతూ మరో మహా పాపానికి ఒడిగడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయట.వాయిస్-జగన్ చేసిన కామెంట్స్‌పై రాజకీయంగానూ విమర్శల వేడి పెరిగింది.  దేవదేవుని పరకామణిలో దొంగతనం చేస్తే అదేదో చిన్న దొంగతనమే కదా అని వ్యంగ్యంగా మాట్లాడం చూస్తుంటే బాధకలుగుతుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దేవుడి దగ్గర దొంగతనం చేస్తే చిన్న దోంగ తనం అంటూ మాట్లాడిన జగన్‌ సంగతి దేవుడే చూసుకుంటాడని లోకేష్ అన్నారు. పరకామణి చోరీని చిన్న తప్పు అనడంపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.  కలియువ వెంకటేశ్వరుడి ఆలయంలో చోరీ చేయడమే మహాపాపం అని అన్నారు. వెంకన్న ఖజానాలో చోరి జరిగితే చిన్న చోరీ అంటావా...బుద్దుందా జగన్ అంటూ బీజేపీ నేతలు ఘాటుగానే విమర్శించారు. 72వేల చోరీ చేసిన వ్యక్తికి 14 కోట్లు ఎలా వచ్చాయో తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతలు జగన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తుంటే...వైసీపీ నేతలు మాత్రం సమర్ధించే విధంగా మాట్లాడుతుండటం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది. దొంగ ఇచ్చిన 14 కోట్ల రూపాయలను టీటీడీ మాజీ ఛైరెమన్ భూమన కరుణాకర్‌ రెడ్డి దానంగా చెప్పుకురావడం మరింత సంచలనంగా మారింది.  టీడీడీకి ఎవరు దానం ఇచ్చినా...దానంగానే పరిగణిస్తారని చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.  దొంగ ఇచ్చారా...మరొకరిచ్చారా అనేది కాదని...ఎవరిచ్చినా తీసుకునే పరిస్ధితి టీటీడీలో ఉందంటూ భూమన కరుణా రెడ్డి మరో వివాదానికి తెరలేపారు జగన్‌ వ్యాఖ్యలతో మరోసారి రాజకీయానికి కేంద్రబిందువుగా తిరుమల పరకామణి ఇష్యూ మారింది. జగన్‌ వ్యాఖ్యలు దొంగను సమర్థించే విధంగా ఉన్నాయంటూ కూటమి పార్టీలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే...వైసీపీ నేతలు మాత్రం..జగన్‌ను వెనకేసుకొస్తుండటం..అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోందట.  

పరకామణి చోరీపై జగన్ కామెంట్స్...ముప్పేట దాడి షురూ

  పరకామణి చోరీపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.  తిరుమల పరకామణి చోరీని..చిన్న చోరీ అనడం చర్చనీయాంశమయ్యాయి. జగన్ వ్యాఖ్యలు దొంగలను సమర్థిస్తున్నాయంటూ కూటమి పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తిరుమల పరకామణి చోరీ కేసుపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకుతిరుమల పరకామణి చోరీ కేసుపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.  తిరుమల పరకామణి చోరీని చిన్న చోరీ అన్న జగన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయట. పరమ పవిత్రమైన శ్రీవారి ఆలయంలో దొంగతనం జరిగిందని చెబుతూనే...దేశంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుంటాయని...అలానే తిరుమలలో జరిగిందనే విధంగా జగన్‌ మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కలియుగ దైవంగా కొలిచే తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీని.... చిన్న చోరీగా జగన్ అభివర్ణించడం రాజకీయ నేతలు, శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.    పరకామణి చోరీ కేసు రాజీపై కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. వైసీపీ హయాంలో చోరీ జరగగా...నిందితుడితో టీటీడీ పెద్దలు రాజీ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ వివాదం సర్దుమణిగింది. కానీ  కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పరకామణి కేసు రాజీ చేసుకోవడాన్ని తప్పుబడుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.  రాజీ కుదర్చుకోవడం చట్ట బద్దం కాదని, నిబంధలకు విరుద్ధంగా నడుచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.  ఈ విషయంపై హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చోరీ కేసును రాజీ చేసుకోవడం తప్పంటూ వ్యాఖ్యానించడమే కాకుండా, సీఐడీ విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది.  ఓవైపు సీఐడీ విచారణ జరుగుతున్న క్రమం...మరోవైపు హైకోర్టులో విచారణ దశలో ఉన్న కేసుపై జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదో చిన్న కేసు అంటూ కేవలం  9 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తుండగా... తమ హయాంలోనే పట్టుకున్నామని...చోరీని తేలిగ్గా చూపే ప్రయత్నం చేయడంపై భక్తులు,సోషల్ మీడియాలో దుమెత్తిపోస్తున్నారు.  అంతేకాకుండా 72 వేల రూపాయల విలువైన డబ్బు చోరీ జరిగితే...దొంగ ప్రాయశ్చిత్తంగా 14 కోట్లు విలువైన ఆస్తులను స్వామి వారికి రాసిచ్చారని జగన్ చెప్పడాన్ని భక్తులు తప్పుబడుతున్నారట.  72 వేలు విలువైన డాలర్లను దొంగతనం చేసిన వాడు 14 కోట్ల ఆస్తులను తిరిగి ఇచ్చాడంటే అతడికి అంత ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంపై విచారణ జరపాలి కదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయట.  చోరీని తక్కువ చేసి చూపడం దొంగలను సమర్థించడమే అవుతుందని భక్తులు మండిపడుతున్నారట. పరమ పవిత్రంగా భావించి శ్రీవారికి సమర్పించుకున్న మొక్కులు, కానుకలు చోరీకి గురైతే చిన్న చోరీ అంటూ దొంగలకు వత్తాసు పలుకుతూ మరో మహా పాపానికి ఒడిగడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయట.వాయిస్-జగన్ చేసిన కామెంట్స్‌పై రాజకీయంగానూ విమర్శల వేడి పెరిగింది.  దేవదేవుని పరకామణిలో దొంగతనం చేస్తే అదేదో చిన్న దొంగతనమే కదా అని వ్యంగ్యంగా మాట్లాడం చూస్తుంటే బాధకలుగుతుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దేవుడి దగ్గర దొంగతనం చేస్తే చిన్న దోంగ తనం అంటూ మాట్లాడిన జగన్‌ సంగతి దేవుడే చూసుకుంటాడని లోకేష్ అన్నారు. పరకామణి చోరీని చిన్న తప్పు అనడంపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.  కలియువ వెంకటేశ్వరుడి ఆలయంలో చోరీ చేయడమే మహాపాపం అని అన్నారు. వెంకన్న ఖజానాలో చోరి జరిగితే చిన్న చోరీ అంటావా...బుద్దుందా జగన్ అంటూ బీజేపీ నేతలు ఘాటుగానే విమర్శించారు. 72వేల చోరీ చేసిన వ్యక్తికి 14 కోట్లు ఎలా వచ్చాయో తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతలు జగన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తుంటే...వైసీపీ నేతలు మాత్రం సమర్ధించే విధంగా మాట్లాడుతుండటం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది. దొంగ ఇచ్చిన 14 కోట్ల రూపాయలను టీటీడీ మాజీ ఛైరెమన్ భూమన కరుణాకర్‌ రెడ్డి దానంగా చెప్పుకురావడం మరింత సంచలనంగా మారింది.  టీడీడీకి ఎవరు దానం ఇచ్చినా...దానంగానే పరిగణిస్తారని చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.  దొంగ ఇచ్చారా...మరొకరిచ్చారా అనేది కాదని...ఎవరిచ్చినా తీసుకునే పరిస్ధితి టీటీడీలో ఉందంటూ భూమన కరుణా రెడ్డి మరో వివాదానికి తెరలేపారు జగన్‌ వ్యాఖ్యలతో మరోసారి రాజకీయానికి కేంద్రబిందువుగా తిరుమల పరకామణి ఇష్యూ మారింది. జగన్‌ వ్యాఖ్యలు దొంగను సమర్థించే విధంగా ఉన్నాయంటూ కూటమి పార్టీలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే...వైసీపీ నేతలు మాత్రం..జగన్‌ను వెనకేసుకొస్తుండటం..అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోందట.  

మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది... అధైర్య పడొద్దు : కేసీఆర్

  బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లలు కేసీఆర్‌ను  ఫాం హౌస్‌ కలిశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ అన్ని కాలాలు మనకు అనుకులంగా ఉండవు కొన్ని కష్టాలు వస్తాయి. వాటికి కుంగి పోవద్దని తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయిని అప్పటి వరకు ప్రజలు అధైర్యపడొద్దని వచ్చేది మన బీఆర్‌ఎస్ ప్రభుత్వమని తెలిపారు.  కాంగ్రెస్ పాలనలో ఎవరో ఏదో చేస్తారని ఆగం కావొద్దని సూచించారు. గ్రామస్థుల మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించి వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను గుర్తుపట్టి పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాల పరిస్థితిని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారిన పరిస్థితిని, గ్రామస్తులు కేసీఆర్ దృష్టికి తెచ్చి ఆవేదన వ్యక్తం చేశారు

భార‌త్ అంటే...పుతిన్‌కి ఎలాంటి అభిప్రాయ‌ముందంటే!

  పుతిన్ భార‌త్ వ‌చ్చినపుడు ఒక ప్రయివేటు ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో.. కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పారు. ఆ ప్ర‌శ్న‌లేంటి  స‌మాధానాలు ఎలాంటివ‌ని చూస్తే..మీరు 25 ఏళ్లుగా రష్యాకు నాయకత్వం వహిస్తున్నారు. ఇది చాలా అరుదైన రికార్డు. ఈ దీర్ఘకాల పాలనా  రహస్యమేంట‌ని అడ‌గ్గా..  అందుకు స‌మాధానం చెప్పిన  పుతిన్.. రహస్యం ఏమీ లేదు. ప్రజలు మ‌న ప‌ట్ల‌ నమ్మకంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. 1990లలో రష్యా పతనమైంది – ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా. ప్రజలు దేశాన్ని మళ్లీ గౌరవించే స్థితికి తీసుకురావాలని కోరుకున్నారు. నేను ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాను. అంతే అంటూ ఎంతో క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌కు సింపుల్ గా తేల్చేశారు పుతిన్. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మీరు ఆయనతో రెండు సార్లు క‌ల‌సి పనిచేశారు. ఈసారి రష్యా-అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? అని అడిగిన ప్ర‌శ్న‌కు.. పుతిన్ ఇచ్చిన ఆన్స‌రేంంటే.. ట్రంప్ ఒక వ్యాపారవేత్త. ఆయనకు లాభనష్టాలు అర్థమవుతాయత‌ప్ప ఈ పోరాటాలు యుద్ధాల ప‌ట్ల ఆయ‌న‌కేమంత ముక్కువ లేదు.. ఉక్రెయిన్ యుద్ధం అమెరికాకు ఏం లాభం ఇస్తోంది? ఏమీ లేదు – డబ్బు వృథా అవుతోంది. యూరప్‌లో అస్థిరత పెరుగుతోంది. ట్రంప్ దీన్ని అర్థం చేసుకుంటార‌నే అనుకుంటున్నా అన్నారు పుతిన్.. రష్యాతో ఒప్పందం చేసుకోవడం అమెరికాకు మేలు చేస్తుందని ఆయన భావిస్తే, ఆ దిశలో అడుగులు వేస్తారు. ఇందుకు మేము సిద్ధంగా ఉన్నామ‌ని కుండ బ‌ద్ధ‌లు కొట్టేశారు పుతిన్.  ఇక‌ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎప్పుడు ముగిస్తారు? అన‌డిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా పుతిన్.. యుద్ధం మా చాయిస్ కాదన్నారు. 2014లో కీవ్‌లో పశ్చిమ దేశాల ఆధారిత రాజకీయ తిరుగుబాటు చేశాయి. మిన్స్క్ ఒప్పందాలను జర్మనీ మాజీ ఛాన్సలర్ ఒప్పుకున్నట్టుగా – ఉక్రెయిన్‌ను మోసం చేయడానికే ఆ ఒప్పందాలు చేశామని చెప్పారు. మేము రష్యా మాటును నమ్మమని కోరుకోవడం లేదు – వాళ్లే ఆ మాట చెప్పారు కదా! అని ప్ర‌శ్నించారు. పుతిన్. ఇప్పుడు మా షరతులు స్పష్టం: ఉక్రెయిన్ నిరాయుధీకరణ, నాటోలో చేరకపోవడం, రష్యన్ భాషా హక్కులు, క్రిమియా మ‌రియు నాలుగు ప్రాంతాలు రష్యాలో భాగమే అనే గుర్తింపు. ఇవి నెరవేరితే రేపే యుద్ధం ఆగిపోతుందని తేల్చి చెప్పేశారు పుతిన్.. భారత్-రష్యా సంబంధాలు ఎప్పటికీ మారవని మీరు చెబుతుంటారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. భారత్ మాత్రం కొనసాగిస్తోంది. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా? అని అడగ్గా.. అందుకు పుతిన్ ఏమ‌న్నారంటే.. ఎంత మాత్ర‌మూ ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేద‌న్నారు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ – ఇది భారత దేశ స్వభావం. భారత్ ఎప్పుడూ ఎవరి బెదిరింపులకు లొంగలేదు. 1971లో అమెరికా ఏడో నౌకాదళాన్ని బంగాళాఖాతంలోకి పంపినప్పుడు కూడా భారత్ తన మార్గంలోనే నడిచింది. ఇప్పుడు కూడా అదే. మీరు మా నుంచి చవకగా చమురు కొంటున్నారు, మేము మీ నుంచి ఔషధాలు, టెక్నాలజీ కొంటున్నాం – ఇది పరస్పర లాభం. ఇది దోస్తీ కాదు, వ్యాపారం స‌రిగ్గా అదే స‌మ‌యంలో వ్యూహాత్మక సహకారంగా చెప్పుకొచ్చారు పుతిన్. చైనాతో మీ సంబంధాలు చాలా దగ్గరయ్యాయి. ఇది భారత్‌ను ఆందోళన క‌లిగించే అంశం కదా? అని ప్ర‌శ్నించిన‌పుడు పుతిన్ ఇందుకెలాంటి ఆన్స‌రిచ్చారో చూస్తే..  చైనాతో మా సంబంధాలు భారత్‌కు వ్యతిరేకం కాదు. భారత్-చైనా మధ్య సరిహద్దు సమస్యలు మా వల్ల రాలేదు – అది బ్రిటిష్ వలస పాలన నుంచి వచ్చిన సమస్యలు. మేము ఎప్పుడూ భారత్-చైనా మధ్య యుద్ధం కోరుకోలేదు. రష్యా భారత్‌కు S-400 ఇస్తుంది, చైనాకు SU-35 ఇస్తుంది – ఇది వ్యాపారం. రెండు దేశాలతోనూ మా సంబంధాలు స్వతంత్రంగా ఉంటాయన్నారాయ‌న‌. భారత్ క్వాడ్‌లో ఉంది, అమెరికాతో దగ్గరవుతోంది. ఇది రష్యాకు సమస్య కాదా? అన్న‌ది  స్ట్రైట్ క్వ‌శ్చిన్. కాగా.. పుతిన్ ఇందుకు చెప్పిన ఆన్స‌రేంటంటే.. భారత్ ఎప్పుడూ తన స్వతంత్ర విదేశాంగ విధానం కలిగి ఉంటుంది. 1950-60లలో నెహ్రూ నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ ప్రారంభించినప్పుడు మేము మద్దతు ఇచ్చాం. ఇప్పుడు క్వాడ్‌లో ఉన్నా, భారత్ తన అవసరాలను కాపాడుకుంటుంది. మేము దాన్ని గౌరవిస్తామ‌ని అన్నారే త‌ప్ప భార‌త వైఖ‌రిని వ్య‌తిరేఖించ‌లేదాయ‌న‌.  మీరు ఇండియాలో బ్రహ్మోస్, AK-203 తయారీ, అణు రియాక్టర్లు, ఇప్పుడు రష్యన్ ఆయిల్ రిఫైనరీలు కూడా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు. ఇదంతా ఆంక్షలను దాటవేయడానికా? అన్న‌ది ఒక ప్ర‌శ్న కాగా..  పుతిన్  నవ్వుతూ..  ఆంక్షలు మమ్మల్ని బలహీనపరుస్తాయని వాళ్లు అనుకున్నారు. కానీ మేము బలోపేతమయ్యాం. భారత్‌లో రిఫైనరీ పెట్టడం అంటే మీకు చవకైన ఇంధనం, మాకు స్థిరమైన మార్కెట్. ఇది విన్- విన్ సిట్యువేషన్. ఆంక్షలు లేకపోయినా మేము ఇదే చేసేవాళ్లమ‌ని క్లారిటీ ఇచ్చారు పుతిన్.. మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు? 2036 వరకు కొనసాగుతారా? అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు పుతిన్  చిరుద‌ర‌హాసంతో నేను రిటైర్ అయినప్పుడు మీడియాలో మొదట తెలుసుకుంటారు. ఇప్పుడు రష్యా స్థిరత్వం అవసరం. ఒకవేళ నేను వెళ్లిపోతే ఎవరూ దేశాన్ని విడదీయకుండా చూడాలి. అది జరిగే వరకు నేను ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.. ఇదీ పుతిన్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఆన్స‌ర్స్ ఇచ్చిన విధానం. అప్పుడ‌ప్పుడూ అక్క‌డ‌క్క‌డా చిరున‌వ్వులే త‌ప్ప‌.. ఎలాంటి హావ‌భావ విన్యాసాల‌ను చేయ‌లేదాయ‌న‌. భార‌త్ ప‌ట్ల త‌న వైఖ‌రి చెప్పేట‌ప్పుడు మాత్రం ఒకింత న‌మ్మ‌కంగా స్థిర‌చిత్తంతో చెప్పిన‌ట్టు క‌నిపించింది.  

దినదిన ప్రవర్ధమానంగా దిగజారుతున్న వైసీపీ గ్రాఫ్!

ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన విపక్షం వైసీపీయే. అందులో సందేహం లేదు. ఎందుకంటే కూటమి పార్టీలు కాకుండా అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉన్న పార్టీ వైసీపీయే. అటువంటి వైసీపీ పని తీరును కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి?  ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 17 నెలలు గడిచింది. ఒకింత ఆలస్యమైనా వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. తాము ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల పట్ల వారి స్పందన ఎలా ఉంది అన్న అంశంపై అంతర్గతంగా ఒక సర్వే చేయించారు. ఐప్యాక్ పై నమ్మకం సడలిపోయిందో ఏమో కానీ, ఈ సారి విపక్షంగా తన పార్టీ తీరు ఎలా ఉంది అన్నఅంశంపై ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో కూటమి పాలనపైనా, విపక్షంగా వైసీపీ తీరుపైనా సర్వే చేయించారు.  అయితే ఈ సర్వే ఫలితంతో  జగన్ కు షాక్ తగిలింది.   విపక్షంగా వైసీపీ ఘోరంగా ఫెయిల్ అయ్యిందన్నదే ఈ సర్వే పలితంగా తేలిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి.  గత ఏడాది ఓటమి తరువాత కంటే రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ దారుణంగా పతనమైందని ఆ సర్వేలో తేలిందంటున్నారు. ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా గల్లంతయ్యేంత ఘోర పరాజయం మూటగట్టుకున్న తరువాత.. రాయలసీమలో కూడా వైసీపీ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయిందని ఆ సర్వే పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ అధినేత జగన్ పట్ల కూడా ప్రజలలో వ్యతిరేకత గూడుకట్టుకుంటోందని సర్వే తేల్చిం దంటున్నారు. పార్టీ ఓటమి తరువాత రాష్ట్ర వదిలి బెంగళూరులో ప్రవాసం ఉంటున్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలతో పాటు, పార్టీ క్యాడర్ లో కూడా అసంతృప్తి గూడుకట్టుకుందని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది.   చూడాలి మరి ఈ సర్వే ఫలితంతో నైనా జగన్ రెడ్డి తన తీరు మార్చుకుంటారా?

పరకామణి దొంగను వెనకేసుకొస్తున్న జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరకామణి చోరీ కేసు నిందితుడిని వెనకేసుకు వస్తున్నారు. పరకామణిలో జరిగిన చోరీ చాలా చాలా చిన్నదని అంటూ.. ఆ విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేరం, దొంగతనం చిన్నాదా పెద్దదా అన్నది పక్కన పెడితే.. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. మన చట్టం అదే చెబుతోంది. అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా. కానీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం అదేమంత పెద్ద నేరం కాదని తీసి పడేస్తున్నారు. పరకామణి లో రవికుమార్ అనే వ్యక్తి  ఏదో చిన్న దొంగతనం చేశాడు.. కానీ అందుకు ప్రాయశ్చితంగా  టీటీడీకి 144 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడంటూ వెనకేసుకు వచ్చారు. అటు వంటి వ్యక్తి విషయంలో ఇంత యాగీ చేస్తారేంటంటూ ఆశ్చర్యపోయారు. పరకామణి చోరీ నిందితుడిని వెనకేసుకురావడమే కాదు.. అతడిని మహాదాతగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు.  నిజమే జగన్ హయాంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. ఆయన స్వయంగా ఆక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అటువంటి వ్యక్తికి పరకామణి చోరీ చిన్న విషయం కనిపించడంలో ఆశ్చర్యం లేదు.. కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల శ్రీవారి విషయంలో జగన్ తీరును ఎవరూ సమర్ధించరు. సమర్ధించలేరు. ఎవరి తప్పులకు వారు శిక్ష అనుభవించి తీరాలి. అయినా జగన్ మోహన్ రెడ్డి పరకామణి  చోరీ నిందితుడు రవికుమార్ ను వెనకేసుకురావడం చూస్తుంటే..ఈ చోరీ కేసులోనూ ఆయన ప్రమేయం ఉందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులోనూ తాను బుక్కయ్యే ప్రమాదం ఉందన్న భయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోం దంటున్నారు.   అందుకే పరకామణి చోరీ కేసును ఇప్పుడు తిరగతోడి విచారించడం సరికాదన్నట్లుగా మాట్లాడు తున్నారంటున్నారు.  ఇక్కడ జగన్ పరకామణిలో చోరీ జరగలేదని చెప్పడం లేదు.. కానీ చోరీ చేసిన సొత్తుకంటే ఎన్నో రెట్ల ఆస్తులను టీటీడీకి ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకున్న వ్యక్తిని ఎందుకు విచారణ పేరుతో విధిస్తారని ఆశ్చర్యపోతున్నారు జగన్. రవికుమార్ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రూ.144 కోట్ల ఆస్తులను టీటీడీకి ఇవ్వడం వల్లనే తన హయాంలో ఆ కేసును రాజీ చేశారని చెబుతున్న జగన్ అసలు ఓ చిరుద్యోగికి అంత ఆస్తి ఎక్కడిదన్న విషయం మాత్రం చెప్పలేదు. వాస్తవానికి ప జగన్ హయాంలో తిరుమల పరకామణిలో అవకతవకలకు హద్దు లేకుండా పోయిందనీ, రవికుమార్ ఇటువంటి చోరీలతోనే కోట్ల రూపాయలు సంపాదించాడ, ఆ సంపాదన నుంచి వందల కోట్ల రూపాయలను వైసీపీ నేతలకు రాసిచ్చాడనీ పరిశీలకులు ఆరోపణలు చేస్తున్నారు.  ఏది ఏమైనా చిన్న చోరీ చేసి ప్రాయశ్నితంగా 144 కోట్లు టీటీడీకి రాసిచ్చేశానని రవికుమార్ చెప్తున్న మాటలు, ఆయనను సమర్ధించుకు వస్తూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలూ ఇసుమంతైనా నమ్మశక్యంగా లేవు.   అయినా నేరం జరిగిందని నిందితుడే అంగీకరించాడు. ఇప్పుడు జగన్  కూడా ఔను రవికుమార్ చోరీ చేశాడని చెబుతున్నారు. అలాంటప్పుడు విచారణ జరపడంలో తప్పేముంది? అన్నిటికీ మించి పరకామణి చోరీపై ఫిర్యాదు చేసిన సతీష్ హత్యకు గురి కావడంతో పరకామణి చోరీ వ్యవహారంలో రవికుమార్ వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అవి నివృత్తి కావాలంటే ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే.  అయినా ఇప్పుడు పరకామణి చోరుడు రవికుమార్ ను వెనకేసుకు వస్తూ జగన్ మాట్లాడిన మాటలు వింటుంటే గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు అన్న సామెత గుర్తుకు వస్తోందంటున్నారు పరిశీలకులు.  అదలా ఉంటే కోర్టు కూడా పరకామణి చోరీ వ్యవహారాన్ని లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవడాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇదేమీ చిన్న విషయం కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది.   ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన  పిటిషన్ ను గురువారం (డిసెంబర్ 4) విచారించిన ధర్మాసనం  సతీష్‌కు సంబంధించిన కేసు లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశం లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును   సమర్థించింది.   ఆలయాల ప్రయోజనాల పరిరక్షణలో  కోర్టులే మొదటి సంరక్షకులుగా వ్యవహరిస్తాయని  స్పష్టం చేసింది. పరకామణి చోరీ వంటి తీవ్రమైన కేసులో రాజీ కుదుర్చుకోవడాన్ని తేలికగా తీసుకోలేమని స్పష్టం చేసింది. తరువాత రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్‌పై తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.

పంచాయతీ పంచాయితీ!.. గ్రామాల్లో ఉద్రిక్తతలు.. విషాదాలు!

తెలంగాణలో పంచాయతీల పంచాయితీ జోరుగా ఉంది. స్థానిక ఎన్నికల సందర్బంగా ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న గ్రామాలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో రాజకీయ వేడి పెచ్చరిల్లింది. పార్టీల గుర్తులపై ఈ ఎన్నికలు జరగకపోయినా.. పొలిటికల్ యాక్టివిటీ మాత్రం రసకందాయంలో పడింది. అదలా ఉంచితే.. తెలంగాణలో   పంచాయతీ ఎన్నికల పంచాయితీ పలు గ్రామాలలో ఉద్రిక్తతలకు, మరికొన్ని గ్రామాలలో విషాదాలకూ దారి తీశాయి.  నామినేషన్ల విషయంలో తలెత్తినవిభేదాలతో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి, కొన్ని కుటుంబాలలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి.  అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై అంటే సై అంటున్న ఉదంతాలూ  ఉన్నాయి.  నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు. ఈ విషయమై ఇంట్లో  ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన  తల్లి మందుల లక్ష్మమ్మ (40) ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. అయితే ఆమె కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త చెబుతున్నాడు. ఇదే విషయాన్ని ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ పేర్కొన్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలోవార్డు మెంబర్‌గా నామినేషన్ వేసినందుకు భర్త మంద లించడంతో లక్ష్మి అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.   

వాస్తవ వేదిక.. ప్రజాభిప్రాయాల గొంతుక

ఏపీ టు తెలంగాణ, అమలాపురం టు అమెరికా, ఆమాటకొస్తే ఈ భూమ్యాకాశాల మధ్య ఎక్కడి నుంచి ఎందాకైనా.. విషయం ఏదైనా.. వాస్తవాలను నిగ్గు తేల్చే నిఖార్సయిన వేదిక.. వాస్తవ వేదిక!  జమీన్ రైతు, తెలుగు వన్  సంయుక్త నిర్వహణలో.. జరుగుతోందీ చర్చా వేదిక. ఈ వేదిక ద్వారా అంశమేదైనా... సమాజ హితకరమైన వాడీ వేడీ చర్చ జరుగుతోంది.  జమీన్ రైతు 95 ఏళ్ల నాటి సుదీర్ఘ జర్నలిస్టిక్ అనుభవం గల పత్రిక. ప్రస్తుతం మార్కెట్లో చెలామణిలో ఉన్న ఏ పత్రికకూ ఈ స్థాయిలో అనుభవం లేదన్న విషయం నాటి పాఠకులకు సుపరిచితమే. నేటి కాలానికి తగ్గట్టుగా తమ వాణి వినిపిస్తున్న పత్రిక జమీన్ రైతు. ఇక తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో తెలుగు వారి మధ్య వారధిగా.. వారి వారి అభిప్రాయాలకు గొంతుకగా, వేదికగా కొనసాగుతోంది. అలాంటి తెలుగు వన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ..మధ్య ముఖా ముఖీ.. అది సమాజ హితానికి ఓ దిక్సూచి. మార్గనిర్దేశకత్వంలో సవ్యసాచి.  ప్రస్తుతం దేశంలో ఉన్న సుప్రసిద్ధ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయ యవనికపైకి దూసుకొచ్చిన వారే. అలాంటి విద్యార్ధులకు సంబంధించి ఉద్యమాలు ఎలాంటివి? అవిప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి. ఒకప్పుడు కాలేజీ రాజకీయాల నుంచే రాజకీయాలను మొదలు పెట్టిన హుషారైన కుర్రకారుకూ నేటి యువతకూ గల తేడాలేంటి? వారి ఉడుకురక్తంతో కూడిన ఉద్యమం ఏమై పోయింది? అన్న అంశంపై రెండు భిన్న పార్శ్వాలు ఒకే వేదికపై నుంచి వినిపించే గొంతుక.. ప్రజాభిప్రాయ దీపికగా మారనుందనడంలో సందేహం లేదు. కాబట్టి విజ్ఞులైన పాఠక, ప్రేక్షకులందరూ వాస్తవ వేదిక సెకండ్ ఎడిషన్ గురువారం (డిసెంబర్ 4) సాయంత్రం విడుదలవుతుంది … చూసి అభిప్రాయ వ్యక్తీకరణ చేయాలని ఆశిస్తూ..  మీ తెలుగు వన్, జమీన్ రైతు.

ఒక్క ఆదేశం.. నేతల తీరులో మార్పు.. చంద్రబాబు హ్యాపీ!

కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయాలలో ఇసుమంతైనా వెనుకాడకుండా ముందుకు అడుగులు వేస్తున్నది. అయితే వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది నాయకులు, ఎమ్మెల్యేలు వినా మిగిలిన వారంతా పెద్దగా ప్రజల మధ్యకు రావడం లేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం లేదు. ఇది ఎవరో ప్రత్యర్థులు చెబుతున్న మాట కాదు. స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో పలు మార్లు చెప్పిన మాట. ఈ విషయంలో ఆయన తన అసంతృప్తిని ఇసుమంతైనా దాచుకోలేదు. బాహాటంగానే ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పద్ధతి మార్చుకోవాలని ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నాయ‌కులు పట్టనట్లు వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా గర్హించారు కూడా.  ప్ర‌జ‌ల్లో సంతృప్తి పెంచేలా వ్య‌వ‌హ‌రించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు.  అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు. చంద్రబాబు చెప్పారు, ఇక తప్పదన్నట్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఇలా శచ్చి అలా వెళ్లిపోతున్నారు. ప్రజలతో  మమేకం కావడం లేదు. అదేదో తమకు సంబంధించని ఓ ప్రభుత్వ కార్యక్రమంలా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓ స్పష్టమైన ఆదేశం జారీ చేశారు. అది సత్ఫలితాలను ఇచ్చింది. ఇంతకీ ఆ ఆదేశం ఏమిటంటే..  పింఛ‌న్లు పంపిణీ చేసే కార్య‌క్ర‌మంలో నాయ‌కులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఫొటోలు దిగి వాటిని పార్టీ కార్యాలయ వెబ్ సైట్ లో పోస్టు చేయాలి. కార్యక్రమం ప్రారంభం, ముగింపు ఇలా రెండు సమయాల్లోనూ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులుఫొటోలు దిగా వాటిని పార్టీ ఆఫీస్ వెబ్ సైట్ లో పోస్టు చేయాలన్న చంద్రబాబు ఆదేశాలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇంత కాలం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తూతూ మంత్రంగా పాల్గొంటున్న వారూ, మొత్తానికే డుమ్మా కొట్టేస్తున్న వారూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దీంతో సోమవారం (డిసెంబర్ 1)న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో దాదాపు 90శాతం మంది పాల్గొన్నారు. కేవలం పాల్గొనడమే కాదు.. ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ప్రజలలో మమేకం అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు పార్టీ కార్యాలయ వెబ్ సైట్ లో పోస్టు చేశారు. దీంతో పార్టీ కార్యాలయ సిబ్బంది ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్న వివరాలను గణాంకాలతో సహా చంద్రబాబుకు నివేదించారు. ఈ గణాంకాల ప్రకారం తాజాగా జరిగిన  ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీ కార్యక్రమంలో  90 శాతం మంది నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు సంతోషం వ్యక్తం చేశారు. నేతలలో వచ్చిన మార్పు ను స్వాగతించారు. మిగిలిన పది శాతం మంది కూడా ముందుకు రావాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో వంద శాతం నాయకులు పాల్గొనాలనీ సూచించారు. 

ఐదు లక్షల బీమా...పెళ్లికి పుస్తే మెట్టెలు సర్పంచ్ అభ్యర్థి వరాలు

  తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో సర్పంచ్‌గా ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తులు అనేక హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడు తున్నారు. ఇంటింటికి ఐదు లక్షల బీమా, అమ్మాయి పెళ్లికి పుస్తే మెట్టెలు, ఉచిత అంబులెన్స్ అంటూ గ్రామ ప్రజలకు పోటాపోటీగా ఇలా రకరకాల హామీలు ఇస్తున్నారు... రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో పనుల వనమ్మ నరసింహ యాదవ్ అనే అభ్యర్థి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఆ గ్రామంలో 700 ఇండ్లు ఉండగా, ప్రతీ ఇంటికి ఏడాదికి రూ.1200 ప్రీమియం కడితే, ఏడాదికి రూ.8.40 లక్షలు, ఐదేళ్లకు రూ.42.5 లక్షలు అవుతుందని గ్రామస్తులు తెలిపారు. అందుకు వనమ్మ నరసింహ యాదవ్ ఒప్పుకోవడమే కాకుండా ఈ హామీతో పాటు తన మ్యానిఫెస్టోలో మొత్తం 15 హామీలు ప్రకటించాడు. ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద రూ.5 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్, ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మెట్టెలు, అబ్బాయి వివాహనికి రూ.5,116 ఇస్తానని, ఊర్లో నెలకోసారి మెడికల్ క్యాంపు నిర్వహణ, శస్త్రచికిత్స అవసరం ఉన్నవారికి రూ.15వేల ఆర్థికసాయం, ఇల్లు కట్టుకునేవారికి స్లాబ్ వేసుకునే సమయంలో రూ.21వేలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్ల పంపిణీ, ఉన్నత చదువులకు ఆర్ధిక సాయం, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు  శివరాత్రి, శ్రీరామ నవమి, మొహరం సందర్భంగా ఊర్లో అన్నదానం, రంజాన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు, గ్రామ భద్రత కోసం అన్ని వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, దహన సంస్కారాలకు రూ.10వేలు, అంత్యక్రియల కోసం వైకుంఠ రథం ఏర్పాటు చేస్తానంటూ మొత్తం 15 హామీలను తన మ్యానిఫెస్టో ద్వారా ప్రకటించాడు. ఇదిలా ఉండగా మరోవైపు గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపరం గ్రామంలో ఆంజనేయులు అనే అభ్యర్థి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు.తనను గెలిపిస్తే తాను అమలు చేసే 22 హామీలతో మేనిఫెస్టోను వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చి, ఈ హామీలను అమలు చేయకపోతే పదవి నుండి తప్పుకుంటానని బాండ్ పేపర్లో పేర్కొన్నాడు.  ఇక సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలంలో ఉన్న గుడితండ గ్రామంలో గుగులోతు జయపాల్ నాయక్ అనే అభ్యర్థి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు... గుడితండ గ్రామ పంచాయితీ సర్పంచ్ గా నన్ను ఎన్నుకుంటే నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఇప్పుడున్న ఆస్తులకు మించి అక్రమంగా ఎంత సంపాదించినా... కూడా అలా పెరిగిన వాటిని గ్రామపంచాయతీ జప్తి చేసి ప్రజలకు పంచవచ్చునని తెలియజేస్తూ.. ఈ బాండ్ పేపర్ మీద రాసి మీ అందరి చేతుల్లో పెడుతున్నాను.  పనులు చేయడానికే ప్రజల దగ్గరికి వచ్చాను. గ్రామపంచాయతీ సొమ్మును అక్రమంగా వాడుకోను అంటూ హామీతో కూడిన మేనిఫెస్టోను వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చారు... అనేక గ్రామాల్లో అభ్యర్థులు కురిపిస్తున్న వరాల జల్లు కారణంగా, వారు ఇచ్చే హామీల కారణంగా, వేలం పాట ద్వారా గ్రామస్తు లందరూ కలిస సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటు న్నారు.  ఇలా అనేక గ్రామాల్లో నివాసముంటున్న గ్రామ ప్రజలు ఆదిలాబాద్ జిల్లాలో 22 మంది, నిజామాబాద్ జిల్లాలో 10 మంది, కామారెడ్డిలో 5 మంది, నిర్మల్ జిల్లాలో 8 మంది, ఖమ్మం జిల్లాలో 6 మంది, జనగామ జిల్లాలో 6, వరంగల్ జిల్లాలో 5 మంది, మహబూబాబాద్ జిల్లాలో 3 మంది, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2 మంది, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు...నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం చిన్న ఆడిశర్లపల్లి గ్రామంలో, గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామంలో దేవాలయం నిర్మిస్తామని చెప్పిన అభ్యర్థులను కూడా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.