Read more!

ఇది స‌మాజం సిగ్గుప‌డాల్సిన స‌మ‌యం 

అడ‌వి మృగాలు అనేకం. మాన‌వ స‌మాజంలోనూ మృగాలున్నాయి. రెండుకాళ్ల‌మీద న‌డుస్తాయి, ఆక‌లేస్తే అన్నం తిన్నా తిన‌క‌పోయినా, శ‌రీరానికి ఆక‌లేస్తే మాత్రం విరుచుకుప‌డ‌తాయి. వ‌య‌సు, తార‌ త‌మ్యాలూ మ‌ర్చిపోతారు. దారుణానికి ఒడిగ‌డుతున్నామ‌న్న ధ్యాస ఉండ‌దు క‌నుక మ‌నుషులు అని అన‌లేం. కానీ మ‌న‌మ‌ధ్య‌నే తిరుగుతున్నారు. వీళ్ల‌కి చ‌ట్టం, పోలీసులు, లాఠీలు, జైళ్లూ.. అస‌లు ఉరిశిక్ష అన్నా పెద్ద‌గా భ‌యం లేద‌నే అనిపిస్తుంది. ఇటీవ‌లి కాలంలో వీరి సంఖ్య‌, కేసులు, బాధితుల మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతున్నాయి. ఇది స‌భ్య‌స‌మాజం అవ‌మానంతో త‌ల‌దించుకోవాల్సిన స‌మ‌యం. న‌గ‌రం లోనో, ప‌ట్ట‌ణం లోనో, మారుమూల గ్రామంలోనో ఒక అత్యాచారం జ‌రుగుతుంది. అది కేసు అవుతుంది. త్వ‌ర‌గానో, కొంత ఆల‌స్యంగానూ ఒక‌రిద్ద‌రినో, ఒక్క‌డినో పోలీసులు ప‌ట్టుకుంటారు. కానీ చ‌ట్టాల లొసు గులు అనే తార్రోడ్డు ఏకంగా జైళ్ల‌లోంచి వారు నిదానంగానే పాన్ తింటూ బ‌య‌టికి వ‌చ్చేంత‌గా ఉప‌యోగ‌ ప‌డుతున్నాయి. ఇంతకంటే అన్యాయం మ‌రోటి ఉండ‌దు.  

కాలుకు కాలు, చేతికి చేయి తీసేసే చ‌ట్టం కేవ‌లం  సినిమాల్లో  పెద్ద హీరోగారు  చేస్తేనే  ఆమోద‌యోగ్యం. బ‌యట ఎవ‌రు చేసినా వారికీ జైలే!  కేసు పూర్వాప‌రాలు చ‌ర్చించి న కోర్టులు వేసే శిక్షతోనే ఆ అఘాయి త్యానికి ప్రాణం విడిచిన అమ్మాయి, మ‌హిళ‌కు శాంతి క‌లుగుతుందా అన్న ప్ర‌శ్న‌కు ఎవ్వ‌రూ స‌మాధానం ఇవ్వ‌రు, ఇవ్వ‌లేరు. కానీ నిందితులు అని నెంబ‌ర్ల‌తో బోర్డు క‌ట్టిన వారిని మాత్రం కొన్నాళ్ల‌కు విడుద‌ల చేసి.. ఇక‌నైనా చ‌క్క‌గా బ‌త‌కండ‌ర్రా.. అని  మ‌రీ బ‌డికి పంపిన‌ట్లు మ‌ళ్లీ స‌మాజంలోకే వ‌దులుతున్నాయి కోర్టులు, జైళ్లు!

బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో శిక్ష ప‌డిన 11మందీ జైల్లో ఎంతో స‌త్ప్ర‌వ‌ర్త‌న‌తో మెలిగార‌ట‌. అంచేత వారిని విడిచిపెట్టారు.  గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోను, 2002 గోద్రా అల్లర్ల సమయంలో సామూ హిక అత్యాచారం చేశారు. నాడు ఆమెకు 19 ఏళ్లు. తన రెండేళ్ల కూతురితో పాటు మరో 14 మంది బంధు వులను కూడా చంపేశారు.

బిల్కిస్ బానో కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఒకరైన రాధేశ్యాం షాహా, 15 ఏళ్లు కారాగారంలో  ఉ న్నందున శిక్షను తగ్గించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది గా గుజరాత్ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. ఇలాంటి అద్బుతాలు మ‌న దేశంలోనే జ‌రుగుతాయి. అం దుకే ఎవ‌రు ఎంత ఘోరానికి పాల్ప‌డినా పారిపోవ‌డాలు, త‌ప్పించుకోవడం చేయ‌రు. వీల‌యితే నేరుగా పోలీసు స్టేష‌న్‌కే వెళుతున్నారు. స‌త్కారాలు, తిండి బాగుంటాయి గ‌నుక‌. కొన్నాళ్లు క‌ళ్లు మూసు కుంటే వారే అబ్బే పొర‌పాటు ప‌డ్డాం.. వీడు నిఖార్స‌యినోడు.. అని స్టాంప్ వేసి మ‌రి బ‌య‌టికి పంపేస్తారు.. ఇం దుకే అస‌లు చ‌ట్టాల‌మీద‌, పోలీసు వ్య‌వ‌స్థ మీదా సామాన్యుల‌కు బొత్తిగా న‌మ్మ‌కం పోయింది. 

ఆమ‌ధ్యెపుడు మ‌హారాష్ట్రలో దూడ‌ను దొంగ‌త‌నం చేసేడ‌ని ఒక కుర్రాడిని రైతు తిట్టి కొట్టి వ‌దిలేశాడు. పోలీసులు మాత్రం చిత‌క‌బాది జైల్లో ప‌డేసారు. అత‌న్ని వ‌దిలేరో లేదో ఇంకా తెలియ‌లేదు. కానీ బిల్కిస్ బానో కేసులో నిందితుల‌ను మాత్రం వ‌దిలేశారు. ఆ హీరోలు వీరే...జస్వంత్ నాయీ, గోవింద్ నాయీ, శైలేశ్ భట్, రాధేశ్యామ్‌సాహా, విపిన్ చంద్ర జోషి, కేశర్ భాయీ వొహా నియా, ప్రదీప్ మోడియా, బాకా భాయీ వొహా నియా, రాజూ భాయీ సోనీ, మితేశ్ భట్,  రమేశ్ చందన,  గీత.

11 మంది దోషులు 14 ఏళ్ల శిక్షను పూర్తి చేసుకున్నారు. చట్టప్రకారం కనీసం 14 ఏళ్లు జీవితకాల శిక్ష అనుభవించిన వారు శిక్షను తగ్గించమని విజ్ఞప్తి చేయొచ్చు. ఖైదీల అర్హతల ఆధారంగా ప్రిజన్ అడ్వైజరీ కమిటీ సలహా మేరకు ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంద‌ని గుజరాత్ హోంశాఖ అద నపు కార్యదర్శి రాజ్‌కుమార్ తెలిపినట్లు.

సుప్రీం కోర్టు సూచన మేరకు పంచమహాల్ కలెక్టర్ సుజల్  నేతృత్వంలో గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. బిల్కిస్ బానో కేసు జైలు శిక్ష అనుభవిస్తున్న 11 మందిని సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని ఆ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. కమిటీ సలహా మేరకు వారిని విడుదల చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వు లు జారీ చేసింది. అంటే జైల్లో చెట్ల పెంప‌కం, అంట్లు తోమ‌డం వంటివి చేసే స‌త్పు రుషులు అనిపించు కున్నారా అని దేశ‌మంతా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద విమర్శలు వస్తున్నాయి.  బిల్కిస్ బానో కేసు కంటే తక్కువ తీవ్రత కలిగిన నేరాలు చేసిన వారు జైలు గోడల మధ్య మగ్గిపోతున్నారు. బిల్కిస్ బానో దోషు లను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం ద్వారా వ్యవస్థ మీద బాధితులకు నమ్మకం పోతుంది' అని మానవ హక్కుల లాయర్ షంషద్ పఠాన్ పీటీఐతో అన్నారు.  మహిళా హక్కుల కార్యకర్త కవితా కృష్ణన్ కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారు.