Read more!

ఇదేం స్వాతంత్య్రం. ఇదేమి స్వేచ్ఛ‌? ..  స్మిత స‌బ‌ర్వాల్‌

వంట‌చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, అస‌లు ఏ ప‌ద‌విలో ఉన్నా, మంచి మ‌న‌సున్న మ‌హిళ‌లు ఎవ్వ‌రూ మ‌న‌సుకు క‌ష్టాన్ని క‌లిగించే అంశాన్ని ఊరికే వ‌దిలేయ‌రు. గ‌ట్టిగానే తిర‌స్క‌రిస్తారు, వ్యాఖ్యానిస్తారు, కొంద రైతే తిట్టినా తిడ‌తారు. కానీ స్మితా స‌బ‌ర్వాల్ సీనియ‌ర్ ఐఎ ఎస్ అధికారి క‌నుక గుజ‌రాత్ ప్ర‌భుత్వ నిర్వాకం ప‌ట్ల ఆశ్చ‌ర్య‌పోయారు  బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయం లో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. బిల్కిస్​ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార టీఆర్‌ఎస్ పార్టీ  కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. 

రేపిస్టులను జైలు నుంచి విడిచి పెట్టడం పెట్టడంపై తనకు నమ్మకం కలగడం లేదంటూ వరుస ట్వీట్లు చేశారు. ఒక మహిళగా, సివిల్ సర్వెంట్‌గా తాను ఈ వార్త  చూసి ఆందోళన చెందానంటూ పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ లో ఉన్నా కూడా మాకు మాట్లాడే  హక్కు ఉందంటూ స్మితా పేర్కొనడం కొత్త చర్చకు దారి తీస్తోంది. తెలంగాణకు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఐఏఎస్ అధికారిణిగా సర్వీ సులో ఉన్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో  ఆమె చేసిన ట్వీట్ అధికార, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధికారి అయినంత మాత్రాన ఇటువంటి సంద‌ర్భాల్లో మౌనంగా ఉండ‌ మంటే ఎలా?  అధికారిలోనూ మాన‌వ‌త్వం ఉంటుంది, తోటి మ‌హిళ‌కు జ‌రిగిన అన్యాయానికి తిర‌గ‌బ‌డే త‌త్వం ఉంటుంది. దోషుల‌ను విడుద‌ల చేయ‌డం అదీ స‌త్ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల అంటూ టాగ్ పెట్ట‌డం ఆమెను నిజం గానే ఆగ్ర‌హానికి గురిచేసి ఉంటుంది. 

బిల్కిస్ వివాదం పై శుక్రవారం మరో ట్వీట్ చేశారు స్మితా సభర్వాల్. భయాందోళనలకు గురి కాకుండా.. స్వేచ్చగా ఊపిరి పీల్చుకునే బిల్కిస్ బానో హక్కును మనం మళ్లీ తుడిచిపెట్టినట్టయిందని ట్వీట్‌లో ఆవే దన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేమని  స్మిత  సబ ర్వాల్ పేర్కొన్నారు. 20 ఏళ్లుగా బిల్కిస్ బానో అనుభవిస్తోన్న గాయాల బాధ మరోసారి చెలరేగిందని బిల్కి స్ బానో చెప్పారు. తన జీవితాన్ని, కుటుంబాన్ని ఛిద్రం చేసిన 11 మంది దోషులు జైలు నుంచి విముక్తు లు అయ్యారని తెలిసి, మాటలు రావట్లేదని రాసుకొచ్చారు. మూడేళ్ల కుమార్తెను దూరం చేసిన  వారంద రూ సమాజంలో అడుగు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.